News August 22, 2025
డబ్బులు ఎవరికి ఇవ్వవద్దు: DMHO

అల్లూరి జిల్లాలో ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి సంబంధించి ఇటీవల ప్రొవిజనల్ లిస్టును విడుదల చేశామని డీఎంహెచ్‌వో డాక్టర్ విశ్వేశ్వరనాయుడు శుక్రవారం తెలిపారు. అయితే ప్రొవిజనల్ లిస్టులో ఉన్న అభ్యర్థులకు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నట్లు మా దృష్టికి వచ్చిందన్నారు. అభ్యర్థులు ఎవరూ డబ్బులు ఇవ్వవద్దని సూచించారు. ఆశాకార్యకర్తల పోస్టులు పారదర్శకంగా భర్తీ చేస్తున్నామన్నారు
Similar News
News January 22, 2026
దేవాలయాల భద్రతపై ఎస్పీ సమీక్ష

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ బి.ఉమామహేశ్వర్ దేవాలయాల భద్రతపై దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ కార్యవర్గ సభ్యులు, పోలీస్ అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని అన్ని దేవాలయాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. విలువైన ఆభరణాలు, వస్తువులను కార్యక్రమాల అనంతరం సురక్షిత లాకర్లలో భద్రపరచాలని ఆదేశించారు.
News January 22, 2026
TU: ఐదు పరీక్ష కేంద్రాల్లో 2,729 మంది హాజరు

తెలంగాణ వర్సిటీ పరిధిలో B.Ed, B.P.Ed మొదటి, మూడో సెమిస్టర్, రెగ్యులర్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగాయని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య చంద్రశేఖర్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 5 పరీక్ష కేంద్రాల్లో మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 2,798 మంది విద్యార్థులకు గాను 2,729 మంది విద్యార్థులు హాజరు కాగా 69 మంది గైర్హాజరయ్యారని ఆయన వెల్లడించారు. ఎటువంటి మాస్ కాపీయింగ్‌కు పాల్పడలేదన్నారు.
News January 22, 2026
తొలిసారిగా స్వయం జనగణనకు అవకాశం

TG: జనగణనలో తొలిసారిగా ప్రజలు స్వయంగా వివరాలు నమోదు చేసుకొనే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. ఇంటింటి సర్వే ఆరంభానికి 15 రోజుల ముందు వరకు ఇందుకు అవకాశమిచ్చింది. ఈమేరకు గెజిట్ జారీచేసింది. కాగా రాష్ట్రంలో 2026 APR1 నుంచి జన గణన ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. జనగణన SEP 30 వరకు జరుగుతుందని పేర్కొంది. సిబ్బంది ఇంటింటికీ వెళ్లి గృహ గణన చేపట్టనున్నారు.


