News January 13, 2026

డయాబెటిస్ భారం.. భారత్‌కు రెండో స్థానం

image

డయాబెటిస్ వల్ల అత్యధిక ఆర్థిక భారం పడుతున్న దేశాల జాబితాలో భారత్ రెండో స్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. తాజా అధ్యయనం ప్రకారం ఇండియాపై డయాబెటిస్ కారణంగా 11.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక భారం పడుతోంది. ఈ జాబితాలో US 16.5 ట్రిలియన్ డాలర్లతో టాప్‌లో ఉండగా, 11 ట్రిలియన్ డాలర్లతో చైనా మూడో స్థానంలో ఉంది. వైద్య ఖర్చులు పెరగడం ప్రజల ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Similar News

News February 15, 2026

‘పవన్ కళ్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో’ రచయిత మృతి.. అనుమానాలు?

image

TG: యూట్యూబర్, రచయిత బొగ్గుల శ్రీనివాస్ మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న అతడు ప్రయాణిస్తున్న కారు ఖమ్మం జిల్లాలోని పాలేరు జలాశయంలోకి దూసుకెళ్లింది. వెనుక భాగంలో కూర్చున్న శ్రీనివాస్ మరణించగా, డ్రైవర్ కారులో నుంచి కిందపడి అక్కడి నుంచి పరారైనట్లు మత్స్యకారులు తెలిపారు. కర్నూలు జిల్లాకు చెందిన శ్రీనివాస్ గతంలో ‘పవన్ కళ్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో’ అనే పుస్తకంతో చర్చనీయాంశంగా మారారు.

News February 15, 2026

CNF అంటే ఏంటో తెలుసా?

image

రైలు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు CNF అని వస్తే టికెట్ కన్ఫామ్ అయిందని అర్థం. కోచ్ నంబర్, బెర్త్ నంబర్ మీ టికెట్‌పై మెన్షన్ చేస్తారు. ఉదాహరణకు CNF/D3/18/WS అంటే D3-కోచ్ నంబర్, 18- సీట్ నంబర్, WS- విండో సీట్. IRCTC లేదా అఫీషియల్ రైల్వే సైట్‌లో PNR నంబర్ ఎంటర్ చేస్తే బుకింగ్ స్టేటస్ తెలుస్తుంది.
Share It

News February 15, 2026

సీఎంను కలిసిన విజయ్.. పెళ్లి ఇన్విటేషనేనా?

image

స్టార్ హీరో విజయ్ దేవరకొండ నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ నెల 26న రష్మికతో విజయ్ పెళ్లి, మార్చి 4న రిసెప్షన్ జరగనుందనే ప్రచారానికి ఈ భేటీ మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. రేవంత్ రెడ్డిని తన పెళ్లి లేదా విందుకు విజయ్ ఆహ్వానించినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.