News August 20, 2025

డాక్టరేట్ అందుకున్న వెల్లంకి బిడ్డలు అశోక్, ప్రకాష్

image

రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన ఎర్రోళ్ల అశోక్, నకిరేకంటి ప్రకాష్ డాక్టరేట్ పట్టాలు అందుకున్నారు. మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, వీసీ ప్రొ.కుమార్ చేతుల మీదుగా వారు పట్టాలను స్వీకరించారు. పొలిటికల్ సైన్స్ విభాగంలో అశోక్, కంప్యూటర్ సైన్స్ విభాగంలో ప్రకాష్ డాక్టరేట్లు పొందారు. వారిని కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామస్థులు అభినందిస్తున్నారు.

Similar News

News January 13, 2026

మిగిలిన భోగి పళ్లను ఏం చేయాలి?

image

భోగి పళ్లు పోసిన తర్వాత కింద పడిన పళ్లను పిల్లలు ఏరుకుంటారు. ఆ తర్వాత మిగిలిపోయిన పళ్లను బయట పడేయకూడదు. వాటిని శుభ్రం గోమాతలకు పెట్టడం వల్ల శుభం కలుగుతుంది. ఇతర మూగజీవాలకు ఆహారంగా వేయడం కూడా చాలా మంచిది. ఇలా చేస్తే పళ్లు వృధా కాకుండా ఉండటమే కాకుండా, పశువులకు ఆహారం పెట్టిన పుణ్యం కూడా దక్కుతుంది. ప్రకృతితో ముడిపడి ఉన్న మన సంప్రదాయాల్లో జీవ కారుణ్యం కూడా భాగమని చెప్పడానికి ఇదో నిదర్శనం.

News January 13, 2026

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: డీఎస్పీ శ్రావణి

image

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రజలు కుటుంబ సభ్యులతో సరదాగా గడపాలని అనకాపల్లి డీఎస్పీ ఎం. శ్రావణి సూచించారు. సోమవారం తన కార్యాలయంలో ఆమె మాట్లాడారు. కోడి పందేలు, గుళ్ల ఆటలపై నిషేధం ఉందన్నారు. వాటి జోలికి దూరంగా ఉండాలని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News January 13, 2026

MDK: ఆపరేషన్ స్మైల్.. అమ్మనాన్న మీ దగ్గరికి వచ్చేశా!

image

రాష్ట్రవ్యాప్తంగా జనవరి 1 నుంచి ప్రారంభమైన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం ద్వారా మెదక్ జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సమష్టి కృషి జరుగుతోందని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు. 10 రోజుల్లో 26 మంది బాలలను రక్షించి తల్లిదండ్రులకు అప్పగించగా, 9 మందిని సంరక్షణ కేంద్రాలకు తరలించారు. బాల కార్మికులను పనిలో పెట్టుకున్న యజమానులపై 28 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.