News August 20, 2025

డాక్టరేట్ పట్టా పొందిన కోరుట్ల వాసి

image

ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన 84వ స్నాతకోత్సవంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో కోరుట్ల పట్టణానికి చెందిన వాసం నవీన్ కుమార్ పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ గవర్నర్ జి. విష్ణుదేవ్, ఇస్రో ఛైర్మన్ డాక్టర్ జి. నారాయణ చేతుల మీదుగా ఆయన ఈ పట్టా పొందారు. నవీన్ కుమార్ ప్రతిభను, కృషిని పలువురు అభినందించారు.

Similar News

News January 18, 2026

భర్తిపూడిలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ

image

తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి చిరునామాగా మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మారారని మంత్రి గొట్టిపాటి రవికుమార్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చెప్పారు. బాపట్ల మండలం భర్తిపూడి గ్రామంలో ఆదివారం ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. సినీ నటుడిగా, రాజకీయ నేతగా ప్రజలకు ఆయన ఎన్నో సేవలు చేశారని కొనియాడారు. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ పాల్గొన్నారు.

News January 18, 2026

నా జీవిత కాలం గుర్తుండిపోయే పవిత్ర జ్ఞాపకం: CM

image

మేడారం వేదికగా సమ్మక్క – సారలమ్మ సమక్షంలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం నిర్వహించుకోవడం ఒక అద్వితీయ ఘట్టమని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఆ గిరిజన దేవతల ఆశీస్సులతో రాష్ట్ర ప్రగతి కోసం జరుగుతోన్న ఈ మంత్రివర్గ సమావేశం తన జీవిత కాలం గుర్తుండిపోయే పవిత్ర జ్ఞాపకమని సీఎం పేర్కొన్నారు.

News January 18, 2026

‘శాంతి బోర్డు’లోకి ఇండియాను ఆహ్వానించిన ట్రంప్!

image

గాజా శాంతి బోర్డులో చేరాలంటూ ఇండియాను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆహ్వానించారు. గాజాలో పాలన, పునర్నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి బోర్డ్ ఆఫ్ పీస్‌ను ఈ నెల 15న ఏర్పాటు చేశారు. దీనికి ట్రంప్ ఛైర్మన్‌గా ఉంటారని వైట్ హౌస్ ప్రకటించింది. 11 మంది సభ్యులతో ప్రత్యేకంగా గాజా కార్యనిర్వాహక బోర్డు ఉంటుందని తెలిపింది. మరోవైపు తమకూ ట్రంప్ నుంచి పీస్ బోర్డులోకి ఆహ్వానం అందిందని పాకిస్థాన్‌ వెల్లడించింది.