News November 19, 2025
డిజిటల్ అరెస్ట్ అంటేనే మోసం: ఎస్పీ

డిజిటల్ అరెస్ట్ అంటేనే మోసం అని, అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సైబర్ నేరగాళ్లు పోలీసులు/సీబీఐ అధికారులుగా నటిస్తూ వీడియో కాల్స్ చేసి భయపెట్టడం, వివరాలు తీసుకుని డబ్బులు దోచుకోవడం వంటి కేసులు పెరుగుతున్నాయన్నారు. పోలీసులు ఎప్పుడూ వీడియో కాల్ చేయరని, ఫోన్‌లో డబ్బులు అడగరని స్పష్టం చేశారు. అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే 1930కి లేదా Kurnool Cyber Policeను సంప్రదించాలన్నారు.
Similar News
News January 24, 2026
అత్యాచార కేసుల్లో బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు: కలెక్టర్

ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసుల్లో బాధితుల బంధువులకు వారసులకు (పీవోఏ) యాక్ట్ కింద ఐటీఐ, అగ్రికల్చర్, సోషల్ వెల్ఫేర్, పబ్లిక్ హెల్త్ విభాగాల్లో ఏడుగురికి ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించినట్లు కలెక్టర్ డాక్టర్ సిరి వెల్లడించారు. శనివారం కలెక్టరేట్లోని తన ఛాంబర్‌లో వారికి నియామక పత్రాలను అందజేశారు. ఉద్యోగాలు పొందిన వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు.
News January 24, 2026
కర్నూలు: ‘శ్మశాన వాటికకు వెళ్లాలంటే.. వాగు దాటాల్సిందే’

తుగ్గలిలోని దళితులకు సరియైన శ్మశాన వాటిక లేక మృతదేహంపై మరొక మృతదేహం పెడుతూ అంత్యక్రియలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని కాలనీవాసులు వాపోతున్నారు. శనివారం మరియమ్మ అనే వృద్ధురాలు మృతి చెందడంతో ఆమెను అరకొరగా ఉన్న స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించేందుకు సరైన దారి లేక సుమారు మోకాళ్ల లోతుకుపైగా ఉన్న నీళ్లు ఉన్న బురదలో వెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. దళితులకు శ్మశాన వాటిక స్థలాన్ని చూపాలని కోరారు.
News January 24, 2026
కర్నూలు రైల్వే స్టేషన్లో ముమ్మర తనిఖీలు

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు రైల్వే స్టేషన్‌లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు డాగ్ స్క్వాడ్ బృందాలతో రైల్వే పార్శిల్ కార్యాలయం, వెయిటింగ్ హాలు, ప్లాట్‌ఫారాలు, రైళ్లలో ప్రయాణికుల బ్యాగులను క్షుణ్ణంగా పరిశీలించారు. టౌన్ సీఐ నాగరాజారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీలు ఎలాంటి అసాంఘిక ఘటనలు జరగకుండా ముందస్తు భద్రత చర్యలుగా పోలీసులు తెలిపారు.


