News June 21, 2024

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసిన పోలవరం ఎమ్మెల్యే

image

ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గురువారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించారు. ఉప ముఖ్యమంత్రి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పవన్ కళ్యాణ్‌కి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నియోజకవర్గ అభివృద్ధి కోసం పలు అంశాలపై చర్చించారు.

Similar News

News January 21, 2026

బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత: జడ్జి సుధారాణి

image

బాల్య వివాహాలను అరికట్టాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందని భీమవరం సివిల్ జడ్జి సుధారాణి అన్నారు. బుధవారం ఉండి ఎంపీడీఓ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. బాల్య వివాహాలతో కలిగే అనర్థాలను వివరిస్తూ, ఎక్కడైనా ఇలాంటివి జరిగితే తక్షణమే అధికారులకు సమాచారం అందించాలని కోరారు. అనంతరం ఈ సామాజిక రుగ్మత నిర్మూలనకు అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎన్.సుధీర్ పాల్గొన్నారు.

News January 21, 2026

భీమవరం: మావుళ్లమ్మ తల్లి స్వర్ణ వస్త్ర నిధికి బంగారం అందజేత

image

భీమవరంలో కొలువైన శ్రీమావుళ్లమ్మ అమ్మవారికి పట్టణానికి చెందిన భరత్ కుమార్, వరలక్ష్మీ నాగప్రసన్న 8 గ్రాముల అమ్మవారి స్వర్ణ వస్త్ర నిధికి విరాళంగా అందజేశారు. ఆలయ ప్రధానార్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ నాగభూషణం, ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగర్ పాల్గొన్నారు.

News January 21, 2026

నరసాపురం స్కూల్‌కు జాతీయ స్థాయి గుర్తింపు

image

నరసాపురం స్టీమర్ రోడ్డులోని మున్సిపల్ మోడల్ ప్రాథమిక పాఠశాల అరుదైన మైలురాయిని అందుకుంది. స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్ (SHVRM) మూల్యాంకనంలో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, జాతీయ పోటీలకు ఎంపికైంది. ఈ సందర్భంగా హెచ్ఎం సుధీర్ బాబు, ఉపాధ్యాయులను ఎంఈవోలు పుష్పరాజ్యం, జాన్ ప్రభాకర్ అభినందించారు. పాఠశాల పారిశుద్ధ్యం, హరిత వనరుల నిర్వహణపై అధికారులు ప్రశంసలు కురిపించారు.