News December 3, 2025
‘డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు వక్రీకరించవద్దు’

రాజోలు పర్యటన సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. తెలంగాణ దిష్టి తగిలి కోనసీమలోని కొబ్బరి చెట్లు పోతున్నట్టు వ్యాఖ్యానించారు. దీనిపై తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు పవన్‌ను విమర్శించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో జనసేన కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇరు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణాన్ని చెడగొట్టవద్దని ఆ ప్రకటనలో పార్టీ కోరింది.
Similar News
News February 7, 2026
జనగామ: పులి ఒకటా.. రెండా.. అధికారుల క్లారిటీ

జిల్లాలో రెండు పులులు సంచరిస్తున్నాయని వస్తున్న వార్తలు అవాస్తవమని జనగామ జిల్లా అటవీ శాఖ అధికారిణి లావణ్య క్లారిటీ ఇచ్చారు. ఒక్క పులి మాత్రమే ఉందని, ఒక్కో రోజు ఒక్కో ప్రాంతంలో తిరుగుతూ పశువులపై దాడి చేస్తోందని తెలిపారు. రెండు పులులు తిరుగుతున్నాయని దుష్ప్రచారం చేయవద్దని సూచించారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.
News February 7, 2026
ఈ 3 దేశాల్లో ఇంటర్నెట్ ఉన్నా లేనట్టే!

EAలోని ఎరిట్రియా, N.కొరియా, CAలోని తుర్క్‌మెనిస్తాన్ దేశాల్లో ఇంటర్నెట్ లిమిటెడ్‌గా ఉంటుంది. భద్రతా కారణాలతో టెలికాంలపై ఎరిట్రియా, N.కొరియా ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఎరిట్రియాలో ప్రభుత్వ పర్యవేక్షణలోని కెఫేలపై పౌరులు ఆధారపడతారు. నా.కొరియాలో SM వాడటంపై నిషేధం. తుర్క్‌మెనిస్తాన్‌లో SM, వార్తలు, ఫారిన్ సైట్స్‌ను ప్రభుత్వం బ్యాన్ చేసింది. VPNల సపోర్ట్‌తో వాడుతున్నా ఇబ్బందులు ఎదుర్కొంటారు.
News February 7, 2026
HYD: ఆమోదాలు.. ఖజానా ఖాళీ చేసేందుకేనా?

GHMC పాలకమండలి తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ నెల 10న పదవీకాలం ముగియనుండగా.. 9న స్టాండింగ్ కమిటీ సమావేశం కానుంది. కొన్ని టేబుల్ అజెండాలను ఆమోదించే అవకాశం ఉంది. అయితే ఒక్కరోజు ముందు ఆమోదించి ఏం అభివృద్ధి చేస్తారో అని ప్రజలు చర్చించుకుంటున్నారు. కానీ లోలోపల మాత్రం టెండర్ల బిల్లులు చెల్లింపు పేరుతో ఖజానా ఖాళీ చేయడానికి కమిటీ సమావేశం అవుతోందని ఆరోపణలు వస్తున్నాయి.


