News October 8, 2024

డిసెంబర్‌లో విశాఖ రైల్వే‌జోన్‌కు శంకుస్థాపన..!

image

కేంద్ర రైల్వే మంత్రి, సీఎం చంద్రబాబు భేటీలో విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటుపై స్పష్టత వచ్చింది. డిసెంబరు కల్లా కొత్త రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది. విభజన హామీలో భాగంగా వాల్తేరు డివిజన్‌ను యథావిధిగా ఉంచాలని కోరినట్లు సమాచారం. అలాగే విశాఖ-అమరావతి మధ్య కొత్త రైల్వేలైన్‌‌ ఏర్పాటు, నమోభారత్‌ కింద విశాఖ-నెల్లూరు మధ్య రైలు అనుసంధానం మెరుగుపరచాలని కోరారు.

Similar News

News November 6, 2024

విశాఖ: ఆన్‌లైన్ చెల్లింపులకు క్యూఆర్ కోడ్

image

డిజిటల్ ఇండియాలో భాగంగా వాల్తేర్ రైల్వే డివిజన్ పరిధిలో గల అన్ని స్టేషన్లలోనూ ఆన్‌లైన్ చెల్లింపుల కోసం క్యూఆర్ కోడ్ ఉపయోగించాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు. పాసింజర్ రిజర్వేషన్ సిస్టం & అన్‌రిజర్వ్ టికెటింగ్ సిస్టమ్‌కు సంబంధించి క్యూఆర్ కోడ్ టికెటింగ్‌ను అమల్లోకి తీసుకొచ్చినట్లు బుధవారం తెలిపారు. అవాంతరాలు లేని డిజిటల్ లావాదేవీల కోసం ఈ సౌకర్యాన్ని రైల్వే ప్రయాణికులు వినియోగించుకోవాలన్నారు.

News November 6, 2024

ఇళ్ల నిర్మాణాల ప‌నుల్లో మ‌రింత జోరు పెంచాలి: విశాఖ కలెక్టర్

image

ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న ప‌థ‌కంలో భాగంగా చేప‌ట్టిన ఇళ్ల నిర్మాణాల్లో మ‌రింత పురోగ‌తి సాధించాల‌ని, విశాఖ క‌లెక్ట‌ర్ ఎం.ఎన్.హ‌రేంధిర ప్రసాద్ ఆదేశించారు. బుధ‌వారం కలెక్టరేట్‌తో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిర్దేశిత లక్ష్యాల మేరకు నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

News November 6, 2024

అధికార లాంఛనాలతో మాజీ మంత్రి అంత్యక్రియలు

image

మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాల్సిందిగా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. చీడికాడ మండలం పెదగోగాడలో మాజీ మంత్రి అంతిమయాత్ర మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. రాష్ట్రం నలుమూలల నుంచి అనేకమంది ప్రముఖులు, ప్రజలు తరలివచ్చి తమ నాయకుడికి నివాళులర్పిస్తున్నారు.