News December 1, 2025
డిసెంబర్ 1: చరిత్రలో ఈ రోజు

1963: భారతదేశంలో 16వ రాష్ట్రంగా నాగాలాండ్ అవతరణ
1954: సామాజిక ఉద్యమకారిణి మేధా పాట్కర్ జననం
1955: గాయకుడు ఉదిత్ నారాయణ్ జననం
1980: టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ జననం
1995: మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి మరణం
* ప్రపంచ ఎయిడ్స్ దినం
Similar News
News February 18, 2026
మరోసారి అభిషేక్ డకౌట్

T20WC: భారత డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి నిరాశ పరిచారు. పసికూన నెదర్లాండ్స్‌పై పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగారు. ఇన్నింగ్స్ మూడో బంతికే ఆర్యన్ దత్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యారు. కాగా అభిషేక్ ఈ ప్రపంచకప్‌లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ డకౌట్ కావడం గమనార్హం.
News February 18, 2026
PHOTO GALLERY: విశాఖలో మిలాన్-2026 రిహార్సల్స్

AP: విశాఖ సాగరతీరంలో ఈ సాయంత్రం మిలాన్-2026 రిహార్సల్స్ జరిగాయి. యుద్ధనౌకలు సందడి చేశాయి. 45 భారతీయ నౌకలతో పాటు మొత్తం 71 యుద్ధనౌకలు, సబ్ మెరైన్లు, ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు ప్రదర్శనలో పాల్గొన్నాయి. పెద్దఎత్తున విశాఖ ప్రజలు ఈ విన్యాసాలను వీక్షించారు. రేపు మిలాన్-2026 జరగనుంది.
News February 18, 2026
బంగాళదుంపతో బ్యూటిఫుల్ స్కిన్

బంగాళాదుంపలో బ్లీచింగ్ లక్షణాలు పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్, డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగించడంలో సహాయపడతాయి. దీన్ని ఎలా వాడాలంటే..* బంగాళదుంప రసానికి తేనె కలిపి ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖం ప్రకాశవంతంగా మారుతుంది. * బంగాళదుంప రసానికి పెరుగు కలిపి ముఖానికి రాసి పావుగంట తర్వాత కడిగేయాలి. ఈ ప్యాక్ చర్మంపై ఉండే మలినాలను తొలగిస్తుంది.


