News November 19, 2025

డేటా క్లియర్ చేసి.. ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్ దాచిన రవి!

image

TG: అరెస్ట్ సమయంలో గంటన్నరపాటు ఐ-బొమ్మ రవి ఇంటి తలుపులు తెరవలేదని పోలీసులు తెలిపారు. తాము వచ్చింది చూసి టెలిగ్రామ్, మొబైల్ డేటాను క్లియర్ చేశాడని చెప్పారు. ల్యాప్‌టాప్‌ను బాత్‌రూమ్ రూఫ్ కింద, సెల్‌ఫోన్‌ను అల్మారాలో దాచినట్లు వివరించారు. అటు పోలీసుల విచారణలో రవి నేరాన్ని అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్టులో పొందుపర్చారు. స్నేహితులు, బంధువులతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని పేర్కొన్నాడు.

Similar News

News January 17, 2026

HYD: ఈ వారం టన్నెల్ ప్లాన్ ఖరారు

image

జేబీఎస్-శామీర్‌పేట కారిడార్‌లో భాగంగా హకీంపేట వద్ద 1.6 కిలోమీటర్ల మేర మెట్రోను అండర్ గ్రౌండ్‌లో నిర్మించాలని ఈ వారంలోనే ప్రభుత్వం పక్కాగా ఓకే చేసింది. రక్షణ శాఖ నిబంధనల ప్రకారం భారీ బడ్జెట్‌తో ఈ టన్నెల్ ప్లాన్ ఫైనల్ అయ్యింది. వచ్చే నెలలో ఇక్కడ మట్టి పరీక్షలు, టన్నెల్ మిషన్ల కోసం సర్వే మొదలు కానుంది. హకీంపేట రన్‌వే దగ్గర మెట్రో పిల్లర్లు కనిపించవు. మెట్రోకున్న అతిపెద్ద అడ్డంకి <<18874553>>క్లియర్<<>> అయిపోయింది.

News January 17, 2026

నేడు ముక్కనుమే అయినా నాన్-వెజ్ ఎందుకు తినకూడదు?

image

ముక్కనుమ నాడు మాంసాహారం తినొచ్చు. కానీ, నేడు మాస శివరాత్రి, శనివారం వచ్చాయి. శివరాత్రి శివునికి ప్రీతికరమైనది. అందుకే సాత్వికాహారం తీసుకోవడం ఉత్తమం. అలాగే శనివారం శనిదేవుని, శ్రీనివాసుడి, హనుమాన్ ఆరాధనకు ఉద్దేశించిన రోజు. నియమ నిష్టలు పాటించాలి. ఇలాంటి పవిత్ర తిథి, వారాలు కలిసినప్పుడు మాంసాహారానికి దూరంగా ఉంటే మానసిక ప్రశాంతత, దైవ అనుగ్రహం లభిస్తాయి. అందుకే నేడు శాకాహారానికే ప్రాధాన్యత ఇవ్వండి.

News January 17, 2026

ఇంటి వద్దకే మేడారం ప్రసాదం

image

TG: మేడారం జాతర కోసం TGSRTC వినూత్న సేవలు ప్రారంభించింది. జాతరకు వెళ్లలేని భక్తులు రూ.299 చెల్లిస్తే ఇంటివద్దకే ప్రసాదం వస్తుంది. అమ్మవార్ల ఫొటో, పసుపు, కుంకుమ, బెల్లం ఉండే ప్యాకెట్‌ను సురక్షితంగా డెలివరీ చేస్తారు. ఈ సేవలు ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో బుకింగ్‌కు అవకాశం ఉంది. www.tgsrtclogistics.co.in లేదా 040-69440069, 040-23450033ను సంప్రదించవచ్చు.