News November 7, 2025

డోన్‌ కర్నూలులో కలిసేనా!

image

డోన్‌ నియోజకవర్గాన్ని తిరిగి కర్నూలు జిల్లాలో కలపాలని MLA కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి CM దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. జిల్లా, రెవెన్యూ డివిజన్ మార్పుచేర్పులలో భాగంగా బనగానపల్లి రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలని మంత్రి BC ప్రతిపాదించడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది. డోన్‌-నంద్యాల 108KM కాగా డోన్-కర్నూలు 54KM. ఈ క్రమంలో డోన్‌ కర్నూలులో కలిస్తే బనగానపల్లి రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంది.

Similar News

News January 17, 2026

HYDలో పలు చోట్ల ఫేక్ టాబ్లెట్స్.. జాగ్రత్త..!

image

HYDలో DGCA రిపోర్టు ప్రకారంగా.. తప్పుడు ఔషధ కంపెనీల పేర్లతో పలు మెడికల్ షాపుల్లో తప్పుడు లేబుల్స్ ఔషధాలు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వివిధ రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలించి హైదరాబాద్లో విక్రయిస్తున్నట్లు నిర్ధారించారు. అంతర్రాష్ట్ర నకిలీ మందుల ముఠాలు దీని వెనుక ఉన్నట్లు ఔషధ నియంత్రణ సంస్థ తెలిపింది.

News January 17, 2026

సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు హౌస్ అరెస్ట్

image

లష్కర్ ప్రాంతంలో నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మాజీ డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతిభద్రతలు దెబ్బతినకుండా ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

News January 17, 2026

ఉమ్మడి జిల్లాలో క్రమంగా తగ్గుతున్న చలి తీవ్రత

image

ఉమ్మడి జిల్లాలో చలి తీవ్రత క్రమంగా తగ్గుతూ వస్తుంది. దీంతో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో 12.5℃ నమోదవ్వగా, రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని నేరెళ్లలో 14.5℃ నమోదైంది. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలోని ఇందుర్తిలో 15.0℃, పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం మల్యాలపల్లిలో 15.3℃ కనిష్ఠ ఉష్ణోగ్రతగా నమోదైంది. అటు పగటి ఉష్ణోగ్రతలు కూడా జరుగుతున్నాయి.