News August 14, 2025
డోర్నకల్: నిత్య పెళ్లి కొడుకును అరెస్టు చేసిన పోలీసులు!

ప్రియురాలి ఫిర్యాదుతో ప్రియుడి పెళ్లిని పోలీసులు ఆపేసిన ఘటన డోర్నకల్‌లో బుధవారం జరిగింది. డోర్నకల్‌కు చెందిన మహేశ్‌కు స్థానిక యువతితో పరిచయం ఏర్పడి ప్రేమ వరకు వెళ్లింది. యువతికి ఇటీవల కేంద్ర బలగాల్లో ఉద్యోగం లభించింది. దీంతో బెంగళూరులో విధులు నిర్వహిస్తున్న తనను మహేశ్ నెల క్రితం రహస్యంగా పెళ్లి చేసుకుని, బుధవారం మరో పెళ్లికి సిద్ధం అయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.
Similar News
News March 16, 2026
ఈ సినిమాలకు ‘ఆస్కార్’ దాసోహం

అసాధారణ ప్రతిభకు ‘ఆస్కార్’ అవార్డులు దాసోహమయ్యాయి. 13 నామినేషన్లతో బరిలోకి దిగిన ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ ఉత్తమ చిత్రం, దర్శకుడితో సహా 6 అవార్డులను కొల్లగొట్టింది. 16 నామినేషన్లతో చరిత్ర సృష్టించిన ‘సిన్నర్స్’ 4 అవార్డులు గెలుచుకోగా, ‘ఫ్రాంకెన్‌స్టైన్’ 3 సాంకేతిక అవార్డులను దక్కించుకుంది. ఇక ‘కెపాప్ డీమన్ హంటర్స్’ నామినేట్ అయిన 2 విభాగాల్లోనూ విజయం సాధించి 100% రిజల్ట్‌తో అదరగొట్టింది.
News March 16, 2026
10వ తరగతి పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ మృతి

కర్నూలు జిల్లాలో పదో తరగతి పరీక్షల వేళ మొదటి రోజు విషాద ఘటన జరిగింది. కర్నూలులోని పరీక్ష కేంద్రం శ్రీ చైతన్య పాఠశాలకు చీఫ్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న షేక్ అన్వర్ బాషా అకస్మాత్తుగా మృతి చెందారు. గ్యాస్ట్రిక్ సమస్యతో ఆయన అస్వస్థతకు గురవగా సిబ్బంది పరీక్ష కేంద్రం సమీపంలోని అమ్మ హాస్పిటల్‌కు తరలించారు. హాస్పిటల్‌లో మృతి చెందినట్లు డీఈవో కార్యాలయం ధ్రువీకరించింది.
News March 16, 2026
శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు

AP: నంద్యాల(D)లోని శ్రీశైల మహా క్షేత్రంలో నేటి నుంచి 20వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి వరుసగా భృంగి, కైలాస, నంది, అశ్వ వాహన సేవలు నిర్వహిస్తారు. అమ్మవారు మహాలక్ష్మి, మహాదుర్గ, మహాసరస్వతి, రాజరాజేశ్వరి, నిజరూప అలంకారాల్లో దర్శనమిస్తారు. ఈ 5 రోజులపాటు గర్భాలయ అభిషేకాలు, స్పర్శ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు.


