News January 30, 2025
డోర్నకల్ పొదుపు సంఘంలో రూ.20 లక్షల మోసం!

డోర్నకల్ మున్సిపాలిటీలోని ఓ పొదుపు సంఘానికి రూ.20 లక్షల రుణం మంజూరు చేయడంలో భారీ మోసం జరిగింది. విదేశాల్లో ఉన్న గ్రూప్ లీడర్ పేరుతో రుణం మంజూరు చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన మహిళా సభ్యురాలు సమాచార హక్కు చట్టం ద్వారా ఫిర్యాదు చేశారు. సంబంధిత అధికారులపై విచారణ చేయాలని జిల్లా కలెక్టర్, ఎస్పీ అధికారులను ఆమె కోరుతున్నారు.
Similar News
News February 7, 2025
మెదక్: అప్పుడే మండుతున్న ఎండలు

గత కొన్ని రోజులుగా ఉమ్మడి మెదక్ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న రాష్ట్రంలోనే అత్యధికంగా మెదక్ జిల్లాలో 35.8 డిగ్రీలు నమోదైంది. ఫిబ్రవరి తొలి వారంలోనే పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా రికార్డు అవుతున్నాయి. దీంతో ఇప్పుడే ఇలా ఉంటే మునుముందు పరిస్థితి ఎలా ఉంటుందో అని జనం ఆందోళన చెందుతున్నారు. పొద్దున, సాయంత్రం చల్లగా ఉన్నప్పటికీ పగటిపూట ఎండలు సుర్రుమంటున్నాయి.
News February 7, 2025
MBNRలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి

మహబూబ్‌నగర్ జిల్లా న్యూ <<1538043>>టౌన్ <<>>వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ప్రమాదానికి అతివేగంగా, ఆజాగ్రత్తగా బైక్ నడపడమే కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనలో నారాయణపేట జిల్లాకు చెందిన శశాంక్ (19) నల్గొండకు చెందిన జ్ఞానేశ్వర్ (18) మృతిచెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News February 7, 2025
సంగారెడ్డి: అప్పుడే మండుతున్న ఎండలు

గత కొన్నిరోజులుగా సంగారెడ్డి జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న రాష్ట్రంలోనే అత్యధికంగా మెదక్‌లో 35.8 డిగ్రీలు నమోదైంది. ఫిబ్రవరి మొదటి వారంలోనే పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా రికార్డు అవుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే.. మునుముందు పరిస్థితి ఎలా ఉంటుందో అని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పొద్దున, సాయంత్రం వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ పగటి పుట ఉష్ణోగ్రతలు సుర్రుమంటున్నాయి.