News April 21, 2024

డోర్నకల్: రెండు బైకుల ఢీ.. ఒకరు మృతి

image

ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీకొని ఒకరు మృతిచెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. డోర్నకల్ పట్టణ కేంద్రంలోని శివాలయం సమీపంలో వేగంగా వచ్చిన రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి స్పాట్‌లోనే మృతిచెందాడు. మరో నలుగురికి గాయాలవడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

Similar News

News December 11, 2025

వర్ధన్నపేట: ఫలితం డ్రా.. చిట్టీలు వేసి ప్రకటన

image

వర్ధన్నపేట మండలంలోని అంబేడ్కర్ నగర్‌లో 1వ వార్డు ఫలితాన్ని డ్రా ద్వారా నిర్ణయించారు. ఈ వార్డులో మొత్తం 101 ఓట్లు ఉండగా 91 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ మద్దతు దారురాలు బొక్కల రజనీకి 31 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి గోకల రూపకు 31 ఓట్లు రావడంతో సమాన ఫలితం నమోదైంది. దీంతో నియమాల ప్రకారం ఎన్నికల అధికారులు చిట్టీలు వేసి విజేతను నిర్ణయించారు. గోకల రూపకు అదృష్టం వరించి విజేతగా నిలిచింది.

News December 11, 2025

వరంగల్ జిల్లాలో 61% పోలింగ్ @11AM

image

మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికలకు గాను జిల్లాలో ఉదయం 11 గంటల వరకు 61% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. పర్వతగిరిలో 65.57, రాయపర్తిలో 59.78, వర్ధన్నపేటలో 57.45% నమోదయింది. కాగా, పోలింగ్‌కు ఇంకా రెండు గంటలు మాత్రమే సమయం ఉండటంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

News December 10, 2025

WGL: పల్లెల్లో ఎన్నికల పండగ..!

image

ఉమ్మడి WGL జిల్లాలో మూడు విడతల పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గురువారం తొలి విడత జరగనుంది. పల్లెల్లో ఎన్నికల పర్వం పండగ వాతావరణం సృష్టించగా, అభ్యర్థుల గుణగణాల మీద చర్చలు జోరందుకున్నాయి. పార్టీ రహితంగా ఎన్నికలు జరుగుతున్నా, అభ్యర్థులు పార్టీ కండువాలతోనే ప్రచారం చేస్తూ ఊర్లో రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. బయట ఉన్న ఓటర్లకు ఫోన్లు చేసి రానుపోను ఖర్చులు ఇస్తామని చెబుతున్నారు.