News March 8, 2025
డ్రంక్‌అండ్‌డ్రైవ్ కేసులో వినూత్న తీర్పు

భద్రాచలం ప్రథమ శ్రేణి న్యాయమూర్తి శివ నాయక్ శుక్రవారం వినూత్న తీర్పును ఇచ్చారు. భద్రాచలం, బూర్గంపాడుతో పాటు భద్రాచలం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన ముద్దాయిలకు జరిమానాతో పాటు కమ్యూనిటీ సర్వీస్‌లో భాగంగా కోర్టు ఆవరణలో మొక్కలు నాటలసిందిగా ఆయన తీర్పునిచ్చారు. దీంతో వారు మొక్కలు నాటారు.
Similar News
News January 23, 2026
OFFICIAL: WHO నుంచి వైదొలగిన అమెరికా

WHOతో అమెరికా తన అనుబంధాన్ని తెంచుకుంది. 2026 జనవరి 22న సంస్థ నుంచి అధికారికంగా వైదొలగింది. అధ్యక్షుడు ట్రంప్ బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే దీనిపై సంతకం చేశారు. కరోనా సమయంలో WHO సరిగ్గా స్పందించలేదని, అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని ట్రంప్ ప్రభుత్వం ఆరోపించింది. ఇకపై ఆరోగ్య విషయాల్లో నేరుగా ఇతర దేశాలతోనే ఒప్పందాలు చేసుకుంటామని స్పష్టం చేసింది.
News January 23, 2026
‘నైనీ’ బ్లాకులపై కేంద్ర బృందానికి సింగరేణి CMD నివేదిక

TG: కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన ఇద్దరు సభ్యుల బృందం హైదరాబాద్‌లో సింగరేణి CMD కృష్ణ భాస్కర్, ఉన్నతాధికారులతో భేటీ అయ్యింది. నైనీ బొగ్గు బ్లాకు టెండర్ ప్రక్రియ వివరాలను CMD ఆ బృందానికి సమర్పించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత(CSR) కింద వినియోగించిన నిధుల వివరాలనూ అందించాలని బృందం సభ్యులు అధికారులను కోరారు. రెండేళ్లుగా ప్రభుత్వం ‘రాజీవ్ అభయ హస్తం’ పథకానికి ఈ CSR నిధులనే వినియోగిస్తోంది.
News January 23, 2026
కల్లూరు: గ్రీన్ ఫీల్డ్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి

కల్లూరు మండలం లింగాల గ్రామ సమీపంలో గ్రీన్ ఫీల్డ్ హైవేపై శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఇంకా ప్రారంభం కాని ఈ రహదారిపై బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుల వివరాల కోసం ఆరా తీస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.


