News August 17, 2024
డ్రగ్స్ ఫ్రీ జిల్లాగా తీర్చిదిద్దాలి: కలెక్టర్
అనంతపురం జిల్లాను డ్రగ్స్ ఫ్రీ జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఎన్సీఓఆర్డీ జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని ఎస్పీ కేవీ మురళీకృష్ణతో కలిసి కలెక్టర్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు ఉపయోగించకుండా గట్టి నిఘా చర్యలు తీసుకోవాలని, ఎన్ఫోర్స్మెంట్ పక్కాగా చేపట్టాలన్నారు.
Similar News
News September 19, 2024
అనంత: క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ అభిమానులకు గుడ్ న్యూస్
టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ అభిమానులకు గుడ్ న్యూస్‌గా చెప్పవచ్చు. గాయం నుంచి కోలుకున్న సూర్య, అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో రేపు జరుగనున్న దులీప్ ట్రోఫీలో బరిలోకి దిగనున్నారు. ఇండియా-బి జట్టు తరఫున బరిలో దిగనున్నారు. సూర్యకుమార్ యాదవ్ స్కై షాట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
News September 18, 2024
శ్రీ సత్యసాయి జిల్లాలో రేపటి నుంచి ఉచిత ఇసుక సరఫరా
ప్రభుత్వ కొత్త మార్గదర్శకాల మేరకు శ్రీ సత్యసాయి జిల్లాలో గురువారం నుంచి ఉచిత ఇసుక ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ టీఎస్ చేతన్ తెలిపారు. కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులతో ఇసుక తరలింపుపై సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. తాడిమర్రి మండలం సీసీ రేవు, ముదిగుబ్బ మండలం పీసీ రేవు వద్ద ఇసుక సరఫరాకు అనుమతి ఉందన్నారు. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లోడింగ్ ఉంటుందన్నారు.
News September 18, 2024
ఇసుక రీచ్‌ల వద్ద రాత్రి సమయంలో ఎవరూ బస చేయకూడదు: కలెక్టర్
ఇసుక రీచ్‌ల వద్ద రాత్రి సమయాలలో ఎవరూ బస చేయరాదని సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. గురువారం నుంచి జిల్లాలోని సీసీ రేవు, పీసీ రేవు వద్ద ఇసుక సరఫరాకు అనుమతి ఇచ్చామని తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లోడింగ్ జరుగుతుందన్నారు. కొత్త మార్గదర్శకాల మేరకు ఉచిత ఇసుక సరఫరా చేస్తామన్నారు.