News September 11, 2025
డ్రగ్స్ సమాచారం అందించాలి: వరంగల్ పోలీసులు

గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రయం, రవాణాను అరికట్టేందుకు వరంగల్ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఎవరైనా మత్తు పదార్థాలు అమ్మే ప్రదేశాలు, విక్రేతలు, తరలించే వాహనాల గురించి సమాచారం తెలిసినవారు 1908 నంబర్‌కు లేదా 87126 71111 నంబర్‌కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని పోలీసులు హామీ ఇచ్చారు.
Similar News
News December 16, 2025
గుంటూరులో అదృశ్యం.. హైదరాబాద్‌లో ప్రత్యక్షం

గుంటూరులో అదృశ్యమైన ఇద్దరు బాలురు హైదరాబాద్‌లో ప్రత్యక్షమయ్యారు. లాలాపేటకు చెందిన రెహమాన్ బాషా, నరసరావుపేటకు చెందిన జవాద్ మల్లారెడ్డి నగర్ మెట్టు అంజిరెడ్డి కళ్యాణ మండపంలో జరుగుతున్న ఫంక్షన్ వచ్చి ఈ నెల 14న అదృశ్యమయ్యారు. అయితే రహమాన్ బాషా తల్లిదండ్రులు గొడవల కారణంగా వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఉంటున్న తల్లి వద్దకు రహమాన్ తన స్నేహితుడు జావాద్‌ని కూడా వెంట పెట్టుకొని వెళ్లాడు.
News December 16, 2025
వనపర్తిలో 17న మూడో విడత ఎన్నికలు

వనపర్తి జిల్లాలో ఈ నెల 17న (బుధవారం) మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు పానుగల్, శ్రీరంగాపూర్, వీపనగండ్ల, పెబ్బేరు, చిన్నంబావి మండలాల్లో జరగనున్నాయి. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంటకు ముగుస్తుందని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుందని, ఓటర్లు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News December 16, 2025
అనకాపల్లి: ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పెంపు: DIEO

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఇంటర్మీడియటి మొదటి రెండో సంవత్సరం వార్షిక పబ్లిక్ పరీక్షలకు హాజరు కాబోయే విద్యార్థులకు ఇంటర్ బోర్డు మరోసారి పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు పొడిగించింది. తత్కాల్ స్కీం ద్వారా ఈనెల 22 నుంచి వచ్చేనెల 5వ తేదీ వరకు నిర్ణీత పరీక్ష ఫీజుకు రూ.5000 విద్యార్థులు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని అనకాపల్లి DIEO మద్దిల వినోద్ బాబు కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు తెలిపారు.


