News October 7, 2025
డ్రోన్ సిటీకి ప్రధానితో శంకుస్థాపన

ఈ నెల 16న కర్నూలు పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ డ్రోన్ సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. డిసెంబరులో డ్రోన్ షోను నిర్వహించాలని సూచించారు. కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు కలిగే లబ్ధిని వివరించేందుకు ప్రధాని జిల్లా పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే.
Similar News
News January 24, 2026
భార్య సూచననే పాటించా: సూర్య కుమార్

468 రోజుల తర్వాత <<18940538>>అర్ధసెంచరీ<<>> చేసిన సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను తిరిగి ఫామ్‌లోకి రావడానికి భార్య దేవిషా ఇచ్చిన సలహానే కారణమని చెప్పారు. క్రీజులో కుదురుకునేందుకు కాస్త సమయం తీసుకోమని ఆమె సూచించినట్లు తెలిపారు. న్యూజిలాండ్‌తో ఆడిన రెండు టీ20ల్లో ఇదే పాటించానని SKY పేర్కొన్నారు. నిన్నటి మ్యాచులో 37 బంతుల్లో 82 రన్స్‌తో అదరగొట్టిన సంగతి తెలిసిందే.
News January 24, 2026
నిబంధనలు ఉల్లంఘించే ఆసుపత్రులపై చర్యలు: KMR కలెక్టర్

కామారెడ్డి జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులన్నీ తప్పనిసరిగా ‘క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్-2010’ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. శనివారం ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు, డాక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డీఆర్ఏ కమిటీకి సమర్పించిన ప్రైస్ లిస్ట్ ప్రకారమే రోగుల నుంచి ఫీజులు వసూలు చేయాలని, ఆసుపత్రిలో సిబ్బంది మారితే అధికారులకు తెలపాలన్నారు.
News January 24, 2026
జిల్లాల విభజనపై ఎలాంటి ప్రకటన చేయలేదు: నాయిని

జిల్లాల విభజనపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. సీఎల్పీ మీడియా హాల్‌లో ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఎన్నికల కోసమే బీఆర్ఎస్ నేతలు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, తాము అధికారంలోకి వచ్చి ఇంకా రెండున్నర సంవత్సరాలే అవుతుందన్నారు. అయినా కేసీఆర్ కుటుంబం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎందుకు బట్టలు చించుకుంటోందో చెప్పాలని స్పష్టం చేశారు.


