News March 6, 2025

ఢిల్లీలో ఏటికొప్పాక బొమ్మలకు గుర్తింపు

image

ఢిల్లీలో ఏటికొప్పాక లక్క బొమ్మలకు మంచి గుర్తింపు లభించింది. రాష్ట్రపతి భవన్ పెవిలియన్‌లో ఏటికొప్పాక లక్క బొమ్మలతో పాటు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయ నమూనాను ఏర్పాటు చేశారు. దీంతో ఏటికొప్పాక లక్కబొమ్మలకు కేంద్రం అత్యంత ప్రాముఖ్యత ఇచ్చింది. రాష్ట్రపతి భవన్‌ను సందర్శించే సందర్శకులు ‌ఏర్పాటు చేసిన ఏటికొప్పాక లక్క బొమ్మల వద్ద ఫొటోలు దిగుతున్నట్లు కళాకారుడు శరత్ సత్యనారాయణ తెలిపారు.

Similar News

News December 15, 2025

రామడుగు హరీష్‌కు ‘ఒక్క’ ఓటు అదృష్టం!

image

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్దూరుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి రామడుగు హరీష్‌ సంచలన విజయం సాధించారు. ఒక్క ఓటు తేడాతో విజయం సాధించిన హరీష్‌పై అందరి దృష్టి పడింది. ఆయన తన సమీప ప్రత్యర్థిపై కేవలం ఒక్కే ఒక్క ఓటు మెజారిటీతో గెలుపొందడం విశేషం. ఒక ఓటుతో గెలుపొందడం తన అదృష్టంగా భావిస్తున్నానని హరీష్ తెలిపారు.

News December 15, 2025

సూర్యాపేట: ఒక్క ఓటు తేడాతో BRS మద్దతుదారు గెలుపు

image

సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం భక్తలాపురం గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ఫలితం చివరి వరకూ తీవ్ర ఉత్కంఠ రేపింది. ఎట్టకేలకు BRS బలపరిచిన అభ్యర్థి జుట్టుకొండ గణేశ్ కేవలం ఒక్క ఓటు తేడాతో విజయం సాధించినట్లు రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించారు. సంచలన విజయం సాధించడంతో BRS శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. గణేశ్ మాట్లాడుతూ.. తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాభివృద్ధికి అంకితమవుతానని హామీ ఇచ్చారు.

News December 15, 2025

శంకర్‌పల్లి: పల్లె లత యాదిలో గెలిపించారు!

image

గుండెపోటుతో మరణించిన మాసానిగూడ గ్రామ 8వ వార్డు మెంబర్ అభ్యర్థిని పల్లె లత (42)ను వార్డు ప్రజలు గెలిపించుకున్నారు. ఎన్నికల ప్రచారంలో హుషారుగా పాల్గొన్న ఆమె అస్వస్థతకు గురికాగా కుటుంబీకులు శంకర్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నగరంలోని కాంటినెంటల్ ఆసుపత్రికి షిఫ్ట్ చేయగా చికిత్స పొందుతూ డిసెంబర్ 7న మృతి చెందారు. కాగా, నేటి ఫలితాల్లో ఆమెకు 30 ఓట్ల ఆధిక్యం వచ్చింది.