News December 19, 2024
ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసిన అనపర్తి ఎమ్మెల్యే
అనపర్తి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఢిల్లీలో కేంద్ర మంత్రులను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీ పురందేశ్వరితో కలిసి కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, నితిన్ గడ్కారీ, గజేంద్ర సింగ్ షేకావత్‌ను కలిసి రహదారుల అభివృద్ధి, దేవాలయాల అభివృద్ధి, రైల్వే హల్ట్ ఇప్పించాలని కోరారు. దానిపై కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు.
Similar News
News January 24, 2025
రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో ప్రమాదం
రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో శుక్రవారం ప్రమాదం జరిగింది. అధికారుల వివరాల ప్రకారం.. స్థానికంగా కొత్త టెర్మినల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈక్రమంలో క్రేన్ వైర్ తెగిపడటంతో నిర్మాణంలో ఉన్న కొంత భాగం కూలిపోయింది. ఆ సమయంలో కార్మికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
News January 24, 2025
అయినవిల్లి: యువతి కిడ్నాప్.. కేసు నమోదు
అయినవిల్లి మండలం సిరిపల్లికి చెందిన పదహారేళ్ల యువతిని కిడ్నాప్ చేసిన ఘటనపై కేసు నమోదు చేశామని హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు గురువారం తెలిపారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లికి చెందిన దింపు కార్మికుడు సాయి బుధవారం రాత్రి తన కుమార్తెను కిడ్నాప్ చేశాడంటూ యువతి తండ్రి ఫిర్యాదు చేశారన్నారు. దింపులు తీసేందుకు వచ్చిన సాయి స్థానికంగా ఉంటూ తన కుమార్తెను కిడ్నాప్ చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు.
News January 24, 2025
అమలాపురం: హారన్ కొట్టాడని యువకుడిపై దాడి.. ముగ్గురి అరెస్టు
హారన్ కొట్టాడన్న కారణంతో యువకుడిపై దాడి చేసిన ఘటనలో ముగ్గురిని అరెస్టు చేశామని అమలాపురం టౌన్ సీఐ వీరబాబు తెలిపారు. ఈ కేసులో నిందితులు ఆనందరావు, సురేశ్, సత్యనారాయణను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచామన్నారు.. కోర్టు వారికి 14 రోజులు రిమాండ్ విధించిందన్నారు. వారిని కొత్తపేట సబ్ జైలుకు తరలించామన్నారు. సవరప్పాలానికి చెందిన యువకుడు దుర్గాప్రసాద్‌పై ఈదరపల్లి వంతెన వద్ద యువకులు దాడికి పాల్పడ్డారన్నారు.