News March 7, 2025
ఢిల్లీలో తన వాణి వినిపించిన ప.గో జిల్లా సర్పంచ్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో పంచాయతీ శాఖ నిర్వహిస్తున్న వర్క్ షాప్‌లో ఉండి మండలం మహాదేవపట్నం గ్రామ సర్పంచ్ వెంకట సుబ్బలక్ష్మి శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు అని అన్నారు. తమ గ్రామంలో చేసిన అభివృద్ధి, చేయబోయే కార్యక్రమాల గురించి ఆమె వర్క్ షాప్‌లో వివరించారు.
Similar News
News March 24, 2025
పెనుమంట్ర: 5 నెలల్లో ఐదుగురు మృత్యువాత

పెనుమంట్ర మండలం మార్టేరు సెంటర్ నుంచి వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల వరకు ఉన్న రహదారిపై ఐదు నెలల వ్యవధిలో ఐదుగురు వాహనదారులు మృత్యువాత పడ్డారు. ఈ ప్రాంతం ఇరుకుగా మారడంతో పాటు భారీ వాహనాల అతివేగం ప్రమాదాలకు కారణమని స్థానికులు అంటున్నారు. నిత్యం ఈ దారిలో ఏదొక వాహన ప్రమాదం జరగడం పరిపాటిగా మారిందంటున్నారు. రహదారి వెడల్పు చేస్తేనే కానీ ప్రమాదాలు తగ్గవని వాహనదారులు, స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
News March 24, 2025
ఏలూరులో యువతిపై ముగ్గురు అత్యాచారం

ఏలూరులో దారుణ ఘటన వెలుగు చూసింది. జేపీ నగర్‌కు చెందిన వంశీకృష్ణ ఓ యువతి(18)ని ప్రేమిస్తున్నానని నమ్మబలికి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియోలు ఉన్నాయంటూ వంశీకృష్ణ స్నేహితులు సాయిచరణ్, శివశంకర్ సైతం ఆమెపై అత్యాచారం చేశారు. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ముగ్గురితో పాటు ఈ ఘటనలో ప్రమేయం ఉన్న మొత్తం ఏడుగురిపై పోక్సో కేసు నమోదు చేశారు.
News March 24, 2025
ప.గో: EKYC ఎక్కడ చేస్తారంటే..?

EKYC కాకుంటే వచ్చేనెల నుంచి రేషన్ సరకులు అందవని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ప.గో జిల్లాలో లక్షల్లో రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో ఇంకా చాలా మంది EKYC చేయించుకోలేదు. రాష్ట్రంలో ఎక్కడున్నా సరే.. అక్కడి మీసేవ, రేషన్ షాపు, ఆధార్ సెంటర్లు, సచివాలయాల ద్వారా EKYC చేస్తారు. ఐదేళ్లలోపు పిల్లలు తప్ప.. రేషన్ కార్డులో ఉన్నవారంతా EKYC చేయించుకోవాలి. ఈనెల 31 వరకు గడువు.