News November 19, 2025
తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిపై దృష్టి: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్‌లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ థింక్స్ ఆక్వా పాండ్స్” కార్యక్రమానికి మంగళవారం కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆక్వా రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిని సాధించే దిశగా ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి కలెక్టర్ల సమావేశంలో దిశానిర్దేశం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
Similar News
News January 22, 2026
రైతులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి: కలెక్టర్ నాగరాణి

ఉద్యానవన పంటలలో సాంకేతికతను అందిపుచ్చుకుని రైతులు లాభాలను గడించాలని కలెక్టర్ నాగరాణి పేర్కొన్నారు. తణుకు మండలం యర్రాయి చెరువు గ్రామంలో రెండు ఎకరాల విస్తీర్ణంలో కూరగాయలు పండించేందుకు రూ.1.40 కోట్లు వ్యయంతో ఏర్పాటుచేసిన హైడ్రోపోనిక్ యూనిట్ గురువారం ఆమె సందర్శించి మాట్లాడారు. జిల్లాలో అభ్యుదయ రైతులు హైడ్రోపోనిక్ యూనిట్స్ ఏర్పాటుకు ముందుకు రావాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
News January 22, 2026
పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి చేయాలి: ఎస్పీ

సాంకేతికతను వినియోగించుకుంటూ సమన్వయంతో పని చేసి పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి చేయాలని ఎస్పీ నయీం అస్మి అన్నారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు రాజీపడేది లేదని అన్నారు. గురువారం ఎస్పీ క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లాలోని డీఎస్పీ, సీఐలతో నేర సమీక్షను నిర్వహించారు. 2025 డిసెంబర్ నెలకు సంబంధించిన నేరాల దర్యాప్తు పురోగతిని క్షుణ్ణంగా సమీక్షించారు. కేసుల దర్యాప్తులో వేగం పెంచాలన్నారు.
News January 22, 2026
ప.గో: ‘అమరజీవి జలధార’కు రూ.1,400 కోట్లు

జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ రక్షిత నీరు అందించే ‘అమరజీవి జలధార’ పథకానికి రూ.1,400 కోట్లు మంజూరైనట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. బుధవారం పాలకొల్లులో ఆర్డబ్ల్యూఎస్, ఏజెన్సీ ప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించారు. డెల్టా ప్రజల ఆరోగ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా ఈ పథకాన్ని రూపొందించామని, పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.


