News November 9, 2024
తగ్గుముఖం పడుతున్న సాగర్ రిజర్వాయర్ నీటిమట్టం
నాగార్జునసాగర్ రిజర్వాయర్లో నీటిమట్టం క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ఎగువ నుంచి రిజర్వాయర్‌కు ఇన్ ఫ్లో తగ్గిపోవడంతో రిజర్వాయర్ లో నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. 590 అడుగులుగా ఉండాల్సిన ప్రాజెక్ట్ గరిష్ట నీటిమట్టం శుక్రవారం సాయంత్రానికి 586.80 అడుగులుగా ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలకు 304.4680టీఎంసీలుగా ఉంది.
Similar News
News December 13, 2024
భువనగిరి ఒక్కటే మిగిలింది!
త్వరలో క్యాబినెట్ విస్తరణ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఉమ్మడి నల్గొండ నుంచి ప్రస్తుతం ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. నల్గొండ నుంచి కోమటిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా, సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి ఉత్తమ్ ఉన్నారు. ఈ లెక్కన నల్గొండ, సూర్యాపేట జిల్లాల నుంచి మంత్రి పదవి లభించినట్లైంది. ఇక భువనగిరి జిల్లా మాత్రమే మిగిలుండగా బెర్తు దక్కుతుందో లేదో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.
News December 13, 2024
గడ్కరీతో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి భేటీ
సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో న్యూఢిల్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ భేటీ అయ్యారు. రీజినల్ రింగ్ రోడ్డు (ఉత్తర భాగానికి) నిర్మాణానికి సంబంధించి జాతీయ రహదారుల ప్రాధికార సంస్ధ వద్ద పెండింగ్‌లో ఉన్న టెక్నికల్, ఫైనాన్షియల్ అప్రూవల్‌ను ఆమోదించి పనులు ప్రారంభించాలని గడ్కరీని కోరారు.
News December 12, 2024
NLG: లవ్ మ్యారేజ్.. యువకుడి సూసైడ్
రెండు నెలల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్న యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన చిట్యాలలో జరిగింది. ఎస్సై ధర్మ తెలిపిన వివరాలు.. స్థానిక వెంటాపురానికి చెందిన రబోయిన మహేష్(26) రెండు నెలల కిందటే ప్రేమ వివాహం చేసుకున్నాడు. దంపతుల మధ్య మనస్పర్ధలతో వారిద్దరు వేరువేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన మహేష్ గురువారం ఇంట్లో ఉరివేసుకున్నాడు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.