News September 9, 2025

తనకల్లు మండలంలో ఆటో బోల్తా.. ఇద్దరి మృతి

image

తనకల్లు మండలంలోని కొక్కంటి సమీపంలో మంగళవారం ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో కడప జిల్లా చక్రాయపేట మండలంలోని కొండప్పగారిపల్లి, బురుజుపల్లి గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యవసాయ కూలీలు మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. అగ్రహారంపల్లిలో టమాటా తోటలో పని ముగించుకొని తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగిందని ఎస్సై గోపి తెలిపారు.

Similar News

News December 8, 2025

మెదక్: రెండో విడతలో ఏడు పంచాయతీలు ఏకగ్రీవం

image

మెదక్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఏడు సర్పంచి స్థానాలు, 254 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 8 మండలాల్లో 142 సర్పంచి, 1,035 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచి పదవులు ఏకగ్రీవమైన వాటిలో వెల్దుర్తి మండలం షౌకత్ పల్లి, నగరం, బస్వాపూర్, మెదక్ మండలం మల్కాపూర్ తండా, చిన్న శంకరంపేట మండలం మాందాపూర్ తండా, గవలపల్లి తండా, సంగాయపల్లి ఏకగ్రీవం అయ్యియి.

News December 8, 2025

పల్నాడు: కంటతడి పెట్టించిన తల్లి ఆక్రందన

image

వినుకొండకి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కుందుర్తి హనుమత్ శాండిల్య (32) విహారయాత్ర నిమిత్తం అస్సాం వెళ్లి, ఈ నెల 5న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. యువకుడి మృతదేహం ఆదివారం వినుకొండ చేరుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయులైన తల్లిదండ్రులు రవి, రమాదేవి తమ ఏకైక కుమారుడి మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించారు. ‘అమ్మతో ఒక్కసారి మాట్లాడయ్య’ అంటూ ఆ తల్లి చేసిన ఆక్రందన అక్కడి వారిని కంటతడి పెట్టించింది.

News December 8, 2025

ఆదోని జిల్లా ప్రజల ఆకాంక్ష!

image

ఆదోని జిల్లా సాధనపై అన్ని వర్గాలు కదం తొక్కుతున్నాయి. నెల రోజులుగా నిరసనలు చేస్తూ జిల్లాతోనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అందరూ అభిప్రాయపడుతున్నారు. జిల్లా ఏర్పాటు సాధ్యసాధ్యాలపై జిల్లా నేతలు చర్చించి తనకు నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో పశ్చిమ ప్రాంత ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాలతో జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది.