News April 13, 2024
తప్పుడు అఫిడవిట్‌ను సమర్పిస్తే చర్యలు: SP

నామినేషన్ సమయంలో రాజకీయ పార్టీలు అభ్యర్ధులు, ఎవరైనా తప్పుడు అఫిడవిట్ ను సమర్పిస్తే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని నల్గొండ జిల్లా ఎస్పీ చందన దీప్తి తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం పోటీ చేసే అభ్యర్థులు తప్పుడు అఫిడవిట్ ను సమర్పించడం, అఫిడవిట్‌లో కొంత సమాచారాన్ని దాచిపెట్టి అఫిడవిట్ ను సమర్పించడం నేరంగా పరిగణించబడుతుందని ఎస్పీ వెల్లడించారు.
Similar News
News December 8, 2025
కేతేపల్లి: మూడుసార్లు సస్పెండ్.. సతీమణికి సర్పంచ్ టికెట్

కేతేపల్లి మండలం చెర్కుపల్లి గ్రామానికి చెందిన చిన్నబొస్క ప్రసాద్ గతంలో పలు కారణాలపై మూడుసార్లు (మొత్తం 18 నెలలు) సర్పంచ్ పదవి నుంచి సస్పెండ్ అయ్యారు. గ్రామ సభలు పెట్టలేదని, ముగ్గురు పిల్లలు ఉన్నారని, ఉప సర్పంచ్ సంతకం ఫోర్జరీ చేశారని ఆయనపై చర్యలు తీసుకున్నారు. ఈసారి జనరల్ మహిళకు రిజర్వేషన్ రావడంతో, ప్రసాద్ సతీమణి చిన్నబొస్క శైలజ సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు.
News December 8, 2025
NLG: మాటల తూటాలు.. స్నేహ బంధాలు!

జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ఆయా పార్టీలు వైరం మరిచి ఒకరికొకరు సహకరించుకుంటున్నాయి. చాలా చోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తుండగా.. మరికొన్ని చోట్ల సీపీఎం, బీజేపీ, ఇంకొన్ని చోట్ల బీజేపీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాయి. నిన్నటి వరకు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చిన నేతలు ఇప్పుడు స్నేహబంధం చాటుతూ.. కలిసి ఓట్లు అడుగుతుండటంతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
News December 8, 2025
కట్టంగూరు: బాండ్ పేపర్‌పై హామీ.. నెరవేర్చకుంటే రిజైన్..!

తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తానని అభ్యర్థిని శ్రీపాద పుష్పలత సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రూ.100 బాండ్ పేపర్‌పై ఆమె హామీలను లిఖితపూర్వకంగా రాసి ఇచ్చారు. తనను గెలిపిస్తే గ్రామంలో మరో అండర్‌పాస్ నిర్మాణం కోసం పోరాడతానని, రెండేళ్లలో అండర్‌పాస్ సాధించని పక్షంలో రాజీనామా చేస్తానని ప్రజల సమక్షంలో ప్రకటించారు.


