News November 7, 2025

తప్పులు లేని ఓటర్ జాబితా సిద్ధం చేయండి: కలెక్టర్

image

కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో ఓటర్ జాబితాపై రాష్ట్ర ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పుట్టపర్తి కలెక్టరేట్లో కలెక్టర్ శ్యాంప్రసాద్, జేసీ మౌర్య భరద్వాజ్ పాల్గొన్నారు. రాష్ట్రంలో తప్పులు లేని ఓటరు జాబితా తయారీకి అందరూ చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు. తప్పులు లేని ఓటర్ జాబితా తయారు చేయాలని జిల్లాలోని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

Similar News

News January 24, 2026

నేడు నగరిలో చంద్రబాబు పర్యటన

image

AP: నేడు CM చంద్రబాబు చిత్తూరు(D) నగరిలో పర్యటించనున్నారు. 11AMకు నగరి జూ. కాలేజ్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడే ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటారు. తర్వాత శాప్ మైదానంలో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర ప్రజా వేదికలో పాల్గొంటారు. అక్కడ స్వచ్ఛ రథాలను ప్రారంభిస్తారు. అనంతరం జూనియర్ కాలేజ్ గ్రౌండ్‌లో TDP శ్రేణులతో సమావేశమవుతారు. సాయంత్రం తిరుగు పయనమవుతారు.

News January 24, 2026

డెయిరీ ఫామ్ ప్రారంభించే ముందు ఇవి చేయాలి

image

డెయిరీ ఫామ్ ప్రారంభానికి ముందు కొంత భూమిలో నేపియర్, గినీ గడ్డి, జొన్న.. మరి కొంత భూమిలో అలసంద, పిల్లిపెసర, లూసర్న్ పశుగ్రాసాలను సాగుచేయాలి. సుబాబుల్, అవిసె చెట్లను ఫామ్ పెట్టే స్థలం చుట్టూ కంచెలా వేయాలి. ఇలా పశుగ్రాసాన్ని పెంచి, షెడ్లు కట్టిన తర్వాత పరికరాలు, మందులు కొనుగోలు చేశాక పాడి పశువులను కొనాలంటున్నారు నిపుణులు. అధిక పాలిచ్చే పశువుకు ఉండే లక్షణాలు తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్ <<>>చేయండి.

News January 24, 2026

ఏలూరు: ప్రమాదం.. బావాబామ్మరుదులు మృతి

image

గ్రీన్ ఫీల్డ్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో జంగారెడ్డిగూడెం మండలం లక్కవరానికి చెందిన కొమ్ము సాయి, కామవరపుకోట మండలం రామవరానికి చెందిన గట్టు రాంబాబు మృతి చెందారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లింగాల గ్రామ సమీపంలో గ్రీన్ ఫీల్డ్ హైవే పై బైక్ అదుపు తప్పి రైలింగ్ ఢీకొనడంతో వారిద్దరూ మృతి చెందారు. వారిద్దరూ వరుసకు బావ బావమరుదులు. మొక్కజొన్న కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలిసింది.