News September 28, 2024

తప్పు చేస్తే ఆ దేవుడు కూడా క్షమించడు: మాజీ మంత్రి బుగ్గన

image

స్వామి వారి లడ్డూ కల్తీ జరిగినట్లయి ఆ దేవుడు కూడా ఎవరినీ క్షమించడని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. డోన్‌లో శనివారం తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ వివాదంపై మీడియాతో మాట్లాడారు. వారికి అనుకూలమైన అధికారులు, లాబోరేటరీలో పరీక్షలు చేయించి, రిపోర్టులు సేకరించి, గత ప్రభుత్వంపై నిందలు వేయడం మంచిది కాదన్నారు.

Similar News

News October 11, 2024

అయ్యో పాపం.. అమ్మ చనిపోయిందని తెలియక!

image

కర్నూలు జిల్లా సి.బెళగల్ బస్టాండ్ ఆవరణలో కుక్క చనిపోయింది. ఇవాళ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచింది. ఈ కుక్కకు నాలుగు పిల్లలు ఉండగా తల్లి చనిపోయిన విషయం వాటికి తెలియదు. తల్లి లేస్తుందేమోనని ఆశతో ఒడిలో నిద్రపోయాయి. ఆ పిల్లల దీనస్థితిని చూస్తూ అటుగా వెళ్లేవారు అయ్యో పాపం అంటూ వెళ్లిపోయారు. మృతదేహం వద్ద ఉన్న ఆ పిల్లలు చూపరులకు కంటతడి తెప్పించాయి.

News October 11, 2024

హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్‌ వైజాగ్

image

చాగలమర్రి జడ్పీ హైస్కూల్లో 53వ రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్‌ను వైజాగ్ జట్టు కైవశం చేసుకుంది. కర్నూలు జట్టుకు కాంస్య పతకం దక్కింది. వైజాగ్ జట్టుకు మొదటి స్థానం, తూ.గో జట్టుకు రెండో స్థానం, కర్నూలు జట్టుకు మూడో స్థానం లభించింది. కాంస్య పతకం సాధించిన కర్నూలు జట్టును రాష్ట్ర హ్యాండ్ బాల్ సంఘం కార్యదర్శి శ్రీనివాసులు అభినందించారు.

News October 11, 2024

ఇళ్ల నిర్మాణాల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

ఇంటి నిర్మాణాల్లో దిగువ స్థానంలో ఉన్నామని, ఇళ్ల నిర్మాణాలను వెంటనే పూర్తిచేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని నంద్యాల కలెక్టర్ రాజకుమారి తెలిపారు. గురువారం హౌసింగ్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న ఇంటి నిర్మాణాలను త్వరగా పూర్తయ్యేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో 23శాతం మాత్రమే ప్రగతి సాధించారన్నారు.