News March 27, 2024

తలపుల మండలంలో వ్యక్తి దారుణ హత్య

image

శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలంలో మంగళవారం అర్ధరాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మండలంలోని సొమాలవాండ్ల పల్లిలో పాపయ్య నాయుడు(48)ను కొండయ్య నాయుడు రాళ్లతో కొట్టి చంపినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా ఇద్దరూ మద్యం మత్తులో గొడవ పడటంతో హత్యకు దారితీసినట్లు పోలీసులు చెబుతున్నారు.‌‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Similar News

News February 16, 2026

కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: కలెక్టర్

image

రేపు జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని జిల్లాలో సజావుగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఓ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్‌లో జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమ నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అనంతరం జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం పోస్టర్లను ఆవిష్కరించారు.

News February 16, 2026

అనంత: PGRS రద్దు.. కారణం ఇదే.!

image

ఈనెల 16న జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించాల్సిన PGRS, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. CM ఆధ్వర్యంలో మంత్రులు, సెక్రటరీలతో కలిసి బిల్గేట్స్ బృందంతో విజయవాడలో సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లా, డివిజన్, మండల స్థాయుల్లో కూడా కార్యక్రమాలు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు కలెక్టరేట్‌కు రావద్దని విజ్ఞప్తి చేశారు.