News September 13, 2025
తలసరి ఆదాయంలో అట్టడుగున ములుగు జిల్లా..!

అడవుల జిల్లా ములుగు తలసరి ఆదాయంలో రాష్ట్రంలో అట్టడుగున ఉంది. 2023-24 నివేదిక ప్రకారం రూ.1,97,639తో 25వ స్థానంలో కొనసాగుతోంది. జిల్లా ప్రజలు 90% వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు లేకపోవడంతో నిరుద్యోగం పెరిగింది. ఉన్న ఒక్క బిల్ట్ ఫ్యాక్టరీ దశాబ్ధం క్రితం మూతపడింది. ఇప్పుడిప్పుడే పర్యాటక రంగం వృద్ధిలోకి వస్తోంది. పామాయిల్ ఫ్యాక్టరీకి ఇటీవల పునాదులు పడ్డాయి.
Similar News
News December 17, 2025
చెన్నారావుపేట: సెల్యూట్.. జయరాజ్ పోలీస్ అన్న!

చెన్నారావుపేట మండలం బోజేరువు గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ జయరాజ్ పని తీరుకు ప్రజలు సెల్యూట్ పోలీస్ అన్న అని మెచ్చుకుంటున్నారు. గ్రామానికి చెందిన ఓ పండు ముసలావిడ ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చే ప్రయత్నం చేస్తున్న విధానాన్ని గమనించిన హెడ్ కానిస్టేబుల్ జయరాజ్ ఆమెను తన భుజాలపై పోలింగ్ కేంద్రంలోకి మోసుకు వెళ్లారు. ఈ దృశ్యం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటుంది.
News December 17, 2025
మెదక్: సమయం లేదు ఓటరన్నా.. పరిగెత్తు..!

ఉమ్మడి మెదక్ జిల్లాలో 3వ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ క్లైమాక్స్‌కు చేరుకుంది. మధ్యాహ్నం 1 గంటకే సమయం ఉండటంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. క్యూలైన్‌లో ఉన్న వారికే ఓటు వేసే అవకాశం ఉంది. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి వాహనాలు ఏర్పాటు చేసి, బస్సు ఛార్జీలు ఇచ్చి మరీ పిలిపిస్తున్నారు. గడువు ముగిసేలోపు తమ మద్దతుదారులందరితో ఓటు వేయించేందుకు అభ్యర్థులు ఆఖరి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు.
News December 17, 2025
గాజాకు బలగాలు?.. సంకటంలో పాకిస్థాన్!

గాజా స్టెబిలైజేషన్ ఫోర్స్‌కు సైనికులను అందించాలని పాకిస్థాన్‌పై అమెరికా ఒత్తిడి తెస్తోంది. అయితే దీనికి ఒప్పుకోలేక, కాదనలేక పాక్ సంకటంలో ఉంది. సైనికులను పంపిస్తే సొంత దేశంలోనే నిరసనలు ఎదురయ్యే అవకాశం ఉంది. US, ఇజ్రాయెల్‌ను పాక్ ఇస్లామిక్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సైనికులను పంపకపోతే ట్రంప్ ఆగ్రహానికి గురికాక తప్పదు. దీంతో ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్నట్లుగా ఉంది పాక్ పరిస్థితి.


