News November 19, 2025
తలసానిని కలిసిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఎమ్మెల్యేగా విజయం సాధించిన నవీన్ యాదవ్.. మామ, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తలసానికి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌ను తలసాని ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు.
Similar News
News January 17, 2026
చిత్తూరు: క్రికెట్ ఆడుతూ యువకుడి మృతి

చౌడేపల్లి(M) వెంగళపల్లి పంచాయతీ పెద్దూరుకు చెందిన సహదేవ రెడ్డి కుమారుడు తేజ(22) పాలెంపల్లిలో క్రికెట్ టోర్నమెంటుకు వెళ్లాడు. మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఫీల్డింగ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు. గమనించిన సహచార ఆటగాళ్లు అతడిని వెంటనే చౌడేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం పెద్ద ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ ఘటనపై మరిన్ని తెలియాల్సి ఉంది.
News January 17, 2026
వరంగల్: 13 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు

వరంగల్ ఉమ్మడి జిల్లాలో 13 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి.
1. మహబూబాబాద్-ఎస్టీ జనరల్
2. గ్రేటర్ వరంగల్-జనరల్
3. కేసముద్రం-ఎస్టీ మహిళ
4. మరిపెడ-జనరల్ మహిళా
5. తొర్రూర్-జనరల్
6. డొర్నకల్-ఎస్సీ జనరల్
7.పరకాల-జనరల్
8. వర్ధన్నపేట-జనరల్
9. భూపాలపల్లి-బీసీ జనరల్
10. ములుగు-బీసీ మహిళ
11. నర్సంపేట-బీసీ మహిళా
12. జనగామ-బీసీ జనరల్
13. స్టేషన్ ఘన్‌పూర్-ఎస్సీ జనరల్
News January 17, 2026
BREAKING: మేయర్ల రిజర్వేషన్లు ఖరారు

TG: కార్పొరేషన్ మేయర్ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మహిళలకు 50% రిజర్వేషన్లు కేటాయించినట్లు మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి వెల్లడించారు.
*నిజామాబాద్- మహిళ జనరల్ *నల్గొండ- మహిళ జనరల్
*ఖమ్మం- మహిళ జనరల్ *గ్రేటర్ వరంగల్- జనరల్
*GHMC- మహిళ జనరల్ *కరీంనగర్- బీసీ జనరల్
*మంచిర్యాల- బీసీ జనరల్ *మహబూబ్‌నగర్- బీసీ మహిళ
*రామగుండం- ఎస్సీ జనరల్ *కొత్తగూడెం- ఎస్టీ జనరల్


