News August 22, 2025
తల్లిదండ్రులను పిల్లలు ఆదరించాలి: జడ్జి

ఇల్లందు: కనీ పెంచి విద్యా బుద్ధులు నేర్పించి ప్రయోజకుల్ని చేసిన తల్లిదండ్రులను మరవద్దని జడ్జి దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక గోవింద్ సెంటర్‌లోని పెన్షన్ భవన్‌లో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ చైతన్య సదస్సు నిర్వహించారు. వృద్ధుల పట్ల చిన్నచూపు వద్దని, నిరాధారణకు గురైన వయోవృద్ధుల కోసం చట్టాలు ఉన్నాయన్నారు.
Similar News
News January 22, 2026
భారత ప్లేయర్‌కు గాయం

న్యూజిలాండ్‌తో జరుగుతోన్న తొలి టీ20లో టీమ్ ఇండియా స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గాయపడ్డారు. 16వ ఓవర్లో మిచెల్ కొట్టిన బంతిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ఆయన వేలికి గాయమైంది. చేతి నుంచి రక్తం రావడంతో నొప్పితో మైదానాన్ని వీడారు. గాయం తీవ్రత ఎక్కువైతే తర్వాతి మ్యాచుల్లో అక్షర్ ఆడేది అనుమానమే.
News January 21, 2026
అలర్ట్.. దుర్గమ్మ ఆలయం నుంచి కాల్ చేస్తున్నామంటే నమ్మకండి

కనకదుర్గమ్మ దేవస్థానం పేరుతో వస్తున్న నకిలీ ఫోన్ కాల్స్ పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని ఈవో శీనానాయక్ కోరారు. కొంతమంది వ్యక్తులు ఆలయ సిబ్బందిమని చెప్పుకుంటూ భక్తులను మభ్యపెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని బుధవారం ఆయన తెలిపారు. ఇవి సైబర్ మోసాలు అయ్యే అవకాశం ఉందని, గుర్తుతెలియని వ్యక్తులకు వ్యక్తిగత వివరాలు లేదా నగదు పంపవద్దని సూచించారు. ఏదైనా సందేహం ఉంటే నేరుగా తమను సంప్రదించాలని స్పష్టం చేశారు.
News January 21, 2026
కంచికర్ల: ఉరేసుకుని వ్యక్తి మృతి

కంచికచర్ల పట్టణంలో బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది. సొసైటీ బజార్ ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో నివసిస్తున్న అబ్బూరి హరిబాబు (35) సూసైడ్ చేసుకున్నాడు. కుమారుడి అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో మానసిక ఒత్తిడికి గురైన హరిబాబు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.


