News February 3, 2025

తల్లిదండ్రులు మందలించారని విద్యార్థి సూసైడ్

image

శ్రీశైలం నియోజకవర్గం సున్నిపెంటకు చెందిన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల మేరకు.. వైజాగ్ కాలనీకి చెందిన సుధీర్ (20) మార్కాపురంలో బీఎస్సీ నర్సింగ్ రెండో సంవత్సరం చదువుతున్నారు. పలు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News February 9, 2026

కోలుకుంటున్న శరద్ పవార్‌

image

తీవ్ర అస్వస్థతకు గురైన NCP చీఫ్ శరద్ పవార్ కోలుకుంటున్నారని ఆయన కూతురు, ఎంపీ సుప్రియా సూలే తెలిపారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడ్డ ఆయనను ఇవాళ మధ్యాహ్నం పుణేలోని రుబీహాల్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు 5 రోజుల యాంటీబయాటిక్స్ కోర్స్ సజెస్ట్ చేసినట్లు సుప్రియ వెల్లడించారు. ఇటీవల శరద్ పవార్ సోదరుడి కుమారుడు, MH Dy.CM అజిత్ పవార్ విమాన ప్రమాదంలో కన్నుమూసిన విషయం తెలిసిందే.

News February 9, 2026

బందరు పోర్టుకు ‘షిప్‌ బిల్డింగ్‌’ కళ.. ఎంపీ బాలశౌరి హర్షం

image

మచిలీపట్నం పోర్టులో నౌకల నిర్మాణం, మరమ్మతుల సౌకర్యాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడంపై ఎంపీ వల్లభనేని బాలశౌరి సంతోషం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం బందరు పోర్టు రూపురేఖలను మార్చివేస్తుందని, దీనివల్ల పోర్టుకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు జీవో విడుదల చేసిన సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

News February 9, 2026

ఖమ్మం: రైతులకు ముఖ్య గమనిక.. FEB 20 చివరితేదీ

image

ప్రస్తుత పంట సం. 2025- 26లో కనీస మద్దతు ధరకు పత్తి కొనుగోలుకు ఈనెల 20ని చివరి తేదీగా సీసీఐ నిర్ణయించినట్లు అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పత్తి రైతులలో ఇంకా ఎవరైనా సీసీఐకి మద్దతు ధరపై పత్తి అమ్ముకునేందుకు ఉంచినట్లయితే FEB 20లోగా తీసుకొని రావాలని సూచించారు. పత్తిని విక్రయించడానికి కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్‌ను బుక్ చేసుకోవాలని పేర్కొన్నారు.