News February 18, 2025

తాండూరు: కాంట్రాక్ట్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

image

తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింలు అనే వ్యక్తి 20 ఏళ్ల నుంచి సెక్యూరిటీ గార్డ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కొన్ని నెలలుగా జీతాలు రాక మనస్తాపానికి గురై నర్సింలు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు కుటుంబీకులు తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గతంలో ఏజెన్సీల ద్వారా జీతాలు వచ్చేవని కానీ ఇప్పుడు ఆ ఏజెన్సీ నుంచి సక్రమంగా జీతాలు అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News

News March 16, 2026

వారికి రూ.2,500 స్కాలర్‌షిప్?

image

TG: GOVT జూనియర్ కాలేజీల్లో చదివే దివ్యాంగ, ట్రాన్స్‌జెండర్, మెరిట్ విద్యార్థులకు ప్రత్యేక స్కూటర్లు ఇవ్వాలని విద్యాశాఖ యోచిస్తోంది. 10th మార్కుల ఆధారంగా ఏటా 40వేల మందికి ₹2,500 చొప్పున స్కాలర్‌షిప్ ఇవ్వాలని భావిస్తోంది. ఈ 2 స్కీమ్‌లను ప్రభుత్వం ఆమోదిస్తే వచ్చే ఏడాది నుంచి అమలు చేయనుంది. కాగా ప్రభుత్వ డిగ్రీ, బీటెక్ విద్యార్థినులకు ఫ్రీగా EV స్కూటీలు ఇస్తామని CM రేవంత్ <<19350603>>ప్రకటించిన<<>> సంగతి తెలిసిందే.

News March 16, 2026

చాబహార్ పోర్టుపై అమెరికా దాడి

image

ఇరాన్‌పై అమెరికా దాడులు తీవ్రం చేసింది. ఆ దేశ వాణిజ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా చాబహార్ పోర్టుపై దాడికి దిగింది. అక్కడి మిలిటరీ స్థావరంపై ఫైటర్ జెట్లతో విరుచుకుపడింది. మరోవైపు నిన్న రాత్రి దుబాయ్ ఎయిర్‌పోర్టుపై ఇరాన్ డ్రోన్లతో అటాక్ చేసింది. విమానాశ్రయంలోని ఆయిల్ ట్యాంకర్ నుంచి చెలరేగిన మంటలు తాజాగా అదుపులోకి వచ్చాయి. దాడి నేపథ్యంలో ఎయిర్‌పోర్టు నుంచి అన్ని విమాన సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి.

News March 16, 2026

KMR: ఇంటర్‌ పరీక్షలకు 95.10 శాతం హాజరు

image

కామారెడ్డి జిల్లాలో సోమవారం నిర్వహించిన ఇంటర్మీడియట్‌ ఒకేషనల్‌ ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షలకు మొత్తం 1,266 మంది విద్యార్థులకు గాను 1,204 మంది హాజరయ్యారని, 62 మంది గైర్హాజరైనట్లు జిల్లా నోడల్‌ అధికారి షేక్‌ సలాం తెలిపారు. జిల్లావ్యాప్తంగా 95.10 శాతం హాజరు నమోదైందన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయని ఆయన పేర్కొన్నారు.