News November 5, 2025

తాండూరు: చెక్కులు ఇచ్చింది వీళ్లకే..!

image

మీర్జాగూడ ఘోర రోడ్డు ప్రమాదంలో తాండూరు మండలం గౌతాపూర్‌కు చెందిన ముస్కాన్ బేగం, తాండూరు పట్టణంలోని వాల్మీకి నగర్‌కు చెందిన కిష్టాపురం వెంకటమ్మ, బృందావన్ కాలనీకి చెందిన తబస్సుమ్ జహాన్, ఓల్డ్ తాండూరుకు చెందిన దస్తగిరి బాబా (బస్సు డ్రైవర్) మృతిచెందారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రభుత్వం తరఫున ప్రకటించిన రూ.7 లక్షల చొప్పున పరిహారం చెక్కులను అందజేశారు.

Similar News

News January 19, 2026

గద్వాల్: సింగోటం జాతరకి వెళ్లి వస్తుండగా ప్రమాదం

image

కర్నూలు జిల్లా పంచలింగాల గ్రామానికి చెందిన 20 మంది భక్తులు సింగోటం జాతరలో నరసింహస్వామి వారిని దర్శించుకుని ట్రాక్టర్‌లో తిరిగి ఎర్రవల్లి మండలం వేముల స్టేజి దగ్గర సోమవారం తెల్లవారుజామున వెనుక నుంచి నుంచి డీసీఎం ఢీకొంది. ఈ ఘటనలో ఖాజా గౌడ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనం ద్వారా కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News January 19, 2026

పంతం పక్కనబెట్టి ఈ పనులు నేర్చుకోండోయ్!

image

నగరాలు, పట్టణాల్లో ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లకు విపరీతమైన <<18865388>>డిమాండ్<<>> నెలకొంది. చిన్నపని చేసినా రూ.500-1,000 వరకు తీసుకుంటున్నారు. అయితే ఇంత డిమాండ్ ఉన్నప్పటికీ నిరుద్యోగులు ఆ పనులు చేసేందుకు ఇష్టపడట్లేదు. సొసైటీలో తమ హోదా తగ్గుతుందని, వైట్ కాలర్ జాబ్స్ మాత్రమే చేస్తామంటున్నారు. ఆ పంతం పక్కనబెట్టి స్కిల్స్ నేర్చుకుంటే సాఫ్ట్‌వేర్ జాబ్ కంటే ఎక్కువ సంపాదించవచ్చని నిపుణుల మాట. ఏమంటారు?

News January 19, 2026

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

<>బ్యాంక్<<>> ఆఫ్ బరోడా 4 ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ/పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఫిబ్రవరి 6 వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.850, SC, ST, PwBDలకు రూ.175. వెబ్‌సైట్: https://bankofbaroda.bank.in