News September 12, 2025
తాండూరు: సంగెంకలాన్ వాగులో గల్లంతు.. శవమై లభ్యం

తాండూరు మండలం సంగెంకలాన్ వాగులో కొట్టుకుపోయిన మొగులప్ప మృతదేహం లభ్యమైంది. వరద ఉద్ధృతి తగ్గడంతో శుక్రవారం ఉదయం గ్రామస్థులు గాలింపు చేపట్టగా, సంగెంకలాన్-చెట్టినాడ్ సిమెంట్ కర్మాగారం మార్గంలో ఓ చెట్టుకు చిక్కుకుని ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం గ్రామస్థులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని వెలికితీశారు.
Similar News
News December 14, 2025
విజయోత్సవ ర్యాలీలు వేడుకలు నిర్వహించవద్దు: ఎస్పీ స్నేహమెహ్రా

రెండో విడత ఎన్నికల్లో భాగంగా ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ పక్కాగా పాటించాలని ఎవరైనా విస్మరిస్తే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా హెచ్చరించారు. ఆదివారం వికారాబాద్ జిల్లాలో రెండో విడత ఎన్నికలు జరుగుతున్నందున గెలిచిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు సంబరాలను నిర్వహించవద్దని ఎస్పీ సూచించారు. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు.
News December 14, 2025
సిద్దిపేట జిల్లాలో 11AM @ 58.43% పోలింగ్

సిద్దిపేట జిల్లాలో పది మండలాల్లో జరుగుతున్న పోలింగ్‌లో ఉదయం 11 గంటలకు 58.43% పోలింగ్ నమోదైనట్లు జిల్లా అధికారులు తెలిపారు. అక్బర్‌పేట్-భూంపల్లిలో 55.22%, బెజ్జంకి- 57.89%, చిన్నకోడూరు- 56.54%, దుబ్బాక-58.67%, మిరుదొడ్డి-54.48%, నంగునూరు-61.14%, నారాయణరావుపేట- 59.84%, సిద్దిపేట రూరల్- 61.61%, సిద్దిపేట అర్బన్- 61.13%, తొగుట-58.01% పోలింగ్ నమోదైందని అధికారులు వెల్లడించారు.
News December 14, 2025
పెద్దపల్లి జిల్లాలో ఎంతమంది ఓటేశారంటే @11AM

పెద్దపల్లి జిల్లాలో ఉదయం 11 గంటల వరకు 62,187 మంది ఓటు వేయగా 55.20 శాతం పోలింగ్ నమోదైంది. అంతర్గం మండలంలో 10,536 ఓట్లు 58.76 శాతం, ధర్మారం మండలంలో 21,927ఓట్లు 51.66 శాతం, జూలపల్లి మండలంలో 14206 ఓట్లు 58.79 శాతం, పాలకుర్తి మండలంలో 15,518 ఓట్లు 55.19శాతం పోలింగ్ నమోదు అయింది.


