News February 9, 2025

తాండూర్‌కు వాసి డా.జయప్రసాద్‌కు ఉత్తమ అవార్డు

image

తాండూరుకు చెందిన ప్రముఖ వైద్యుడు డా.జయప్రసాద్(జనరల్ సర్జన్)కు మరోసారి ఉత్తమ అవార్డు దక్కింది. రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా ఉత్తమ వైద్యుడిగా అవార్డును అందుకున్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ డా.జయప్రసాద్‌కు ఉత్తమ అవార్డును అందజేశారు. 

Similar News

News February 18, 2026

మార్చి 11న వైవీయూ కాన్వకేషన్ నిర్వహణ: వీసీ

image

YVU కాన్వకేషన్ మార్చి 11వ తేదీన నిర్వహించనున్నట్లు యోగివేమన విశ్వవిద్యాలయ వీసీ ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్ వెల్లడించారు. కాన్వకేషన్ నిర్వహణకు సంబంధించి తేదీని ఖరారు చేస్తూ రాష్ట్ర గవర్నర్ కార్యాలయం నుంచి తమకు ఉత్తర్వులు చేరాయన్నారు. వైవీయూ 11, 12, 13, 14వ కాన్వకేషన్ల ద్వారా 13,399 విద్యార్థులు పట్టాలు అందుకుంటారని చెప్పారు. కాన్వకేషన్ కోర్ కమిటీతో తన ఛాంబర్లో సమావేశమై నిర్వహణపై చర్చించారు.

News February 18, 2026

ఫేక్ వెబ్‌సైట్లతో జాగ్రత్త: నిజామాబాద్ సీపీ

image

ఆన్‌లైన్ సెర్చింగ్ చేసేటపుడు జాగ్రత్తలు పాటించాలని జిల్లా వాసులను సీపీ సాయి చైతన్య అప్రమత్తం చేశారు. సోషల్ మీడియాలో సెర్చ్ చేయగానే ఒరిజినల్ వెబ్‌సైట్ల మాదిరి కనిపించే నకిలీ సైట్లు ఉంటాయన్నారు. ఒక్క అక్షరం తేడాతో ఉండే ఫేక్ వెబ్‌సైట్లు కూడా ఉంటాయని, తెలియని సైట్లలోనూ వ్యక్తిగత వివరాలు ఇవ్వకూడదని హితవు పలికారు.

News February 18, 2026

కామారెడ్డి: ‘పీఎంశ్రీ నిధులు వెంటనే ఖర్చు చేయాలి’

image

కామారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, పీఎంశ్రీ కింద మంజూరైన నిధులకు సంబంధించి, సివిల్ వర్క్స్ ఈనెల 23వ తేదీలోపు పాఠశాలల్లో పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. బుధవారం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా, విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలస్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. సకాలంలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.