News March 14, 2025
తాండూర్: భార్య మందలించిందని వ్యక్తి ఆత్మహత్య

తాండూరు మండలం నగరం గ్రామానికి చెందిన రావుల సాంబయ్య(60) అనే వ్యక్తి భార్య మందలించిందని గురువారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. సాంబయ్య రోజూ మద్యం తాగి ఇంట్లో గొడవపడుతూ ఉండేవాడు. భార్య మందలించడంతో మనస్తాపానికి గురై తన పొలంలో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కొడుకు సంపత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News February 19, 2026
T20 WCలో ఆడనున్న బంగ్లాదేశ్.. ఎప్పుడంటే?

టీ20 వరల్డ్ కప్-2028కి అర్హత సాధించిన 12 జట్ల పేర్లను ICC ప్రకటించింది. ఈ లిస్టులో భారత్, NZ, AUS, PAK, శ్రీలంక, SA, AFG, ENG, ఐర్లాండ్, WI, ZIM, బంగ్లాదేశ్ ఉన్నాయి. WC-26లో సూపర్-8కి వెళ్లిన 8 జట్లు, 2028 WC హోస్ట్ నేషన్స్ (AUS, NZ)తో పాటు టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా 3 జట్లను (AFG, BAN, IRE) తీసుకున్నట్లు వివరించింది. మరో 8 జట్లు క్వాలిఫయర్ మ్యాచుల ద్వారా ఎంపిక కానున్నాయి.
News February 19, 2026
JIPMERలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు

జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్& రీసెర్చ్(<
News February 19, 2026
లోకగమనానికి మూలాధారాలు

వేదమూల మిదం బ్రాహ్మం, భార్యామూల మిదం గృహం|
కృషిమూల మిదం ధాన్యం, ధనమూల మిదం జగత్||
‘ధనం మూలం ఇదం జగత్’ అనే మాట ఈ శ్లోకం నుంచే వచ్చింది. ఈ శ్లోకార్థం.. ‘బ్రాహ్మణత్వానికి వేదాలు, గృహానికి గృహిణి, పంటకు కృషి ఎలా ఆధారమో ఈ లోక వ్యవహారాలన్నింటికీ ధనమే మూలం. డబ్బుతో పాటు సంస్కారం, కుటుంబం, కష్టం కూడా జీవితానికి ముఖ్యమే. మన నిత్య జీవితంలో వాడే ఓ చిన్న నానుడి వెనుక ఇంతటి లోతైన అర్థం, ధర్మ సూత్రం ఉంది.


