News November 5, 2025

తాడిపత్రిలో బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య

image

తాడిపత్రిలో ఓ బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పట్టణంలోని పెద్ద బజార్‌లో యూనియన్ బ్యాంక్ మేనేజర్ గుగారా(41) నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నారు. కొన్ని రోజులుగా ఒంటరిగా ఉంటున్నారు. ఈ క్రమంలో బుధవారం ఇంట్లోనే ఉరివేసుకొని తనువు చాలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News January 24, 2026

సిద్దిపేట: మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరం

image

సిద్దిపేట జిల్లాలోని చేర్యాల, హుస్నాబాద్, గజ్వేల్, దుబ్బాక మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సిద్ధమైంది. మొత్తం 72 వార్డుల కోసం 176 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఎన్నికల విధులకు 49 మంది ఆర్వోలు, 49 మంది ఏఆర్వోలను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. 13 మంది నోడల్ అధికారుల పర్యవేక్షణలో త్వరలోనే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో ఏర్పాట్లు వేగవంతం చేశారు.

News January 24, 2026

ఖమ్మం: ‘రంజాన్ మాసం నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి’

image

ప్రశాంతంగా రంజాన్ మాసం నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి అన్నారు. శనివారం అదనపు కలెక్టర్, కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో రంజాన్ మాసం ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో, ముస్లిం ప్రతినిధులతో సమీక్షించారు. రంజాన్ మాసం సందర్భంగా మసీదుల వద్ద ఎక్కడైనా డ్రైనేజీ, అప్రోచ్ రోడ్డు గుంతల మరమ్మతులు వెంటనే చేపట్టాలని సూచించారు.

News January 24, 2026

గన్ని బ్యాగుల స్టాక్ పటిష్టంగా భద్రపర్చాలి: అ.కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో ఉన్న గన్ని బ్యాగుల స్టాక్ పటిష్టంగా భద్రపర్చాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో గన్ని సంచుల స్టాక్‌పై గోడౌన్ మేనేజర్‌లతో సమావేశం నిర్వహించారు. బంగ్లాదేశ్ నుంచి జూట్ సరఫరాకు ఆటంకాలు ఏర్పడ్డాయని, రాబోయే రబీ సీజన్ ధాన్యం కొనుగోలుకు గన్ని బ్యాగుల ఇబ్బందులు రాకుండా రేషన్ షాపులు, గోడౌన్ నుంచి అందుబాటులో ఉన్న స్టాక్ భద్రపర్చుకోవాలని సూచించారు.