News May 23, 2024
తాడిపత్రి ఘటనలో హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్.. ఆరుగురికి స్థానచలనం

తాడిపత్రి ఘటనకు సంబంధించి నిఘా వైఫల్యంపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. అలజడులని ముందస్తుగా పసిగట్టడంలో విఫలం, ముందస్తుగా అప్రమత్తం చేయకపోవడం, ప్రమాదాన్ని గుర్తించడంలో అలసత్వం వహించిన స్పెషల్ బ్రాంచ్ పోలీసులపై చర్యలు తీసుకున్నారు. ఆరుగురు కానిస్టేబుల్స్‌ను స్పెషల్ బ్రాంచ్ పరిధి నుంచి తప్పించారు. ఒక హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News March 15, 2026
1100 సేవలను వినియోగించుకోండి: కలెక్టర్

మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో ప్రజలు అర్జీలు నమోదు చేసుకొని, తమ సమస్యలకు పరిష్కారం పొందాలన్నారు. రెవెన్యూ పరిధిలోని అన్ని ఫిర్యాదుల పరిష్కారానికి ప్రభుత్వ కార్యాలయాలలో మీకోసం టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 1100 అనే బ్యానర్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
News March 15, 2026
అనంతపురం జిల్లాలో స్వల్పంగా పెరిగిన చికెన్ ధరలు

అనంతపురం జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. గుత్తిలో కేజీ చికెన్ రూ.260, స్కిన్ లెస్ రూ.280, అనంతపురంలో రూ.260, స్కిన్ లెస్ రూ.280 గుంతకల్లులో రూ.240, స్కిన్ లెస్ రూ.260కు విక్రయిస్తున్నట్లు చికెన్ షాప్ నిర్వాహకుడు షఫీ తెలిపారు. కేజీ మటన్ ధరలో రూ.750 ఎలాంటి మార్పు లేదన్నారు. గత వారంతో పోలిస్తే ఈవారం కేజీపై రూ.20 పెరిగినట్లు పేర్కొన్నారు.