News February 10, 2025
తాడేపల్లి: జగన్ ఇంటి వద్ద కెమెరాలు

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద మెగా కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేశారు. ఇటీవల ఆయన నివాసం వద్ద చెలరేగిన మంటలను దృష్టిలో ఉంచుకుని అక్కడ నిఘా పెంచారు. మొత్తం ఎనిమిది కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటి నుంచి వచ్చే చిత్రాలను తాడేపల్లి పోలీస్ స్టేషన్ నుంచి మానిటర్ చేయనున్నారు.
Similar News
News March 17, 2025
గుంటూరు: 10మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు

గుంటూరు మండల విద్యాశాఖ అధికారి ఎస్.ఎం.ఎం ఖుద్దూస్ 10 మంది ఉపాధ్యాయులకు ఆదివారం షోకాజ్ నోటీసులు జారీచేశారు. పదోతరగతి ఇన్విజిలేషన్ డ్యూటీ రిపోర్ట్‌లో నిర్లక్ష్యం చేయడంతో ఆ ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ అధికారి సి.వి రేణుక ఆదేశానుసారం నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. తాఖీదు అందిన వెంటనే సంబంధిత ఉపాధ్యాయులు వివరణ ఇవ్వాలని ఖుద్దూస్ సూచించారు.
News March 17, 2025
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ వికేంద్రీకరణ: కలెక్టర్

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ(PGRS)ను ఈ సోమవారం నుంచి మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ నాగలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలు, డివిజనల్ కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాలలో సమర్పించుకోవచ్చని అన్నారు. ప్రజలకి పాలనను మరింత చేరువ చేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు.
News March 16, 2025
ఉండవల్లి: హడ్కో- సీఆర్డీఏ మధ్య ఒప్పందం

ఉండవల్లి నివాసంలో ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో హడ్కో-సీఆర్డీఏ మధ్య ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం మేరకు రాజధాని నిర్మాణాలకు హడ్కో రూ.11వేల కోట్లు రుణంగా అందించనుంది. జనవరి 22న ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధులు మంజూరుకు అంగీకారం తెలిపారు. కార్యక్రమంలో మంత్రి నారాయణ, హడ్కో సీఎండీ సంజయ్ కుల్ శ్రేష్ఠ, మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు.