News February 16, 2025

తాడ్వాయి: కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

image

తాడ్వాయి మండలం దేవాయిపల్లి గ్రామానికి చెందిన చిందం మల్లయ్య(48) అనే వ్యక్తి శనివారం ఉదయం ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. మల్లయ్య బందువుల పెళ్లి ఉండటంతో చెట్టు కొమ్మలు కొడుతుండగా కొమ్మ విరిగి పక్కనే ఉన్న కరెంట్ లైన్ తీగలపై పడడంతో విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మల్లయ్య భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News April 19, 2026

మెదక్ ఏఎస్పీగా విక్రాంత్ కుమార్ సింగ్

image

మెదక్ జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్)గా 2022 బ్యాచ్‌కు చెందిన విక్రాంత్ కుమార్ సింగ్ ఐపీఎస్ నియమితులయ్యారు. ప్రస్తుతం భద్రాచలంలో ఏఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఆయనను మెదక్‌కు బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ పనిచేసిన మహేందర్ గత నెల 31న రిటైర్ కావడంతో ఆ స్థానంలో విక్రాంత్ బాధ్యతలు చేపట్టనున్నారు.

News April 19, 2026

ప.గో: హాట్ టాపిక్‌.. అసలు సూత్రధారులు ఎవరు?

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరుతో నకిలీ సిఫార్సు లేఖలు తయారుచేసి ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసిన వ్యవహారం జిల్లాలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జనసేన శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేయగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు సైతం ఫిర్యాదు చేయడం కొసమెరుపు. ఇప్పటికే ఈ వ్యవహారం జనసేన పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు సమాచారం.

News April 19, 2026

AP రైతులకు గుడ్ న్యూస్.. సేకరణ పరిమితి పెంపు!

image

APలోని పప్పు ధాన్యాల రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ పరిమితిని పెంచుతూ ప్రధాని మోదీ నేతృత్వంలోని క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న 94,500 టన్నుల పరిమితిని ఇప్పుడు ఏకంగా 1.13 లక్షల టన్నులకు పెంచారు. మార్కెట్‌లో ధరలు లేక ఇబ్బంది పడుతున్న రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు.