News November 8, 2025
తానూరు: దాబాలో ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య

తానూరు మండలం బామ్ని గ్రామానికి చెందిన బాశెట్టి రాజు(41) భోసి గ్రామ సమీపంలోని ఓ దాబాలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాశెట్టి రాజు కొద్ది రోజులుగా దాబాలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. శుక్రవారం దాబాలో అర్ధరాత్రి దాటిన తర్వాత రాజు మద్యం మత్తులో ఉరేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News January 15, 2026
ఉట్నూర్: గిరిజన ఉద్యాన కేంద్రంలో తీరొక్క మొక్కలు

ఉట్నూర్ మండల కేంద్రంలో ఉన్న ఐటీడీఏ ప్రాంగణ ప్రాంతంలోని గిరిజన ఉద్యాన కేంద్రంలో అనేక రకాల మామిడి మొక్కలు, పండ్ల మొక్కలు, పూల మొక్కలను విక్రయిస్తున్నారు. ఇది ఐటీడీఏ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఇక్కడ అలంకరణ మొక్కలు, గిఫ్ట్ మొక్కలు బయటి కేంద్రంలో కంటే తక్కువ ధరలోనే దొరుకుతాయి. ఉట్నూర్ మండల ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
News January 15, 2026
లోయర్ క్లాస్ జాబ్స్ కాదు బాబాయ్.. అసలైన డిమాండ్ వీరికే..

Ai దెబ్బకు భవిష్యత్‌లో వైట్ కాలర్ జాబ్స్ భారీగా తగ్గిపోతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్లంబర్, ఎలక్ట్రిషియన్, కార్పెంటర్.. లాంటి వృత్తులకు భారీ డిమాండ్ ఉంటుందని చెబుతున్నారు. వీటిని యువత లోయర్ క్లాస్ ఉద్యోగాలుగా చూస్తోందని, కానీ హై డిమాండ్ దృష్ట్యా వీటికే ఫ్యూచర్ ఉంటుందని అంటున్నారు. ప్రస్తుత రోజుల్లోనే ఓ ప్లంబర్ ఇంటికి వచ్చి చెక్ చేస్తే రూ.500 తీసుకుంటున్నాడని గుర్తు చేస్తున్నారు. COMMENT?
News January 15, 2026
కలెక్టరేట్‌లో త్రిపురానేని రామస్వామి జయంతి

ప్రముఖ సంఘసంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధుడు, మానవతామూర్తి త్రిపురనేని రామస్వామి జయంతి కార్యక్రమం శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. డీఆర్డీఏ పీడీ నరసయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సువర్ణ ముఖ్య అతిథిగా పాల్గొని త్రిపురనేని రామస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు.


