News November 16, 2025
తిరుచానూరుకు ఆ పేరు ఎలా వచ్చింది…?

పూర్వం శ్రీశుకమహర్షి ఈ ప్రాంతంలో నివసించడం వల్ల శ్రీశుకనూరు అనే పేరు ఏర్పడింది. తమిళంలో తిరుచ్చుగనూరుగా పిలవబడుతూ తర్వాతి కాలంలో తిరుచానూరు వాడుకలోకి వచ్చింది. అలమేలు మంగాపురం, అలమేలుమంగపట్నం అని కూడా పిలుస్తారు.
Similar News
News January 21, 2026
NZB: KCR హయాంలో తెలంగాణ అభివృద్ధి: MP

KCR ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తించి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు BRSకు ఓటేయాలని రాజ్యసభ సభ్యుడు సురేశ్ రెడ్డి కోరారు. బుధవారం ఆర్మూర్ పట్టణంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. తెలంగాణ కోసం అనేక పోరాటాలు జరిపామని, ఇప్పుడు కూడా రాజ్యసభలో రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నామన్నారు.
News January 21, 2026
NLG: జిల్లా కారాగారానికి నూతన సూపరింటెండెంట్

నల్గొండ జిల్లా కారాగారానికి నూతన సూపరింటెండెంట్‌గా కె. ఆనందరావు నియమితులయ్యారు. గత సూపరింటెండెంట్ పదోన్నతిపై చర్లపల్లి కేంద్ర కారాగారానికి బదిలీ అయ్యారు. కె.ఆనందరావు గతంలో కేంద్ర కారాగారం నిజామాబాద్‌లో విధులు నిర్వహించారు. పరిపాలనా అనుభవం కలిగిన అధికారిగా గుర్తింపు పొందిన ఆయన నల్గొండ జిల్లా కారాగార అభివృద్ధికి కృషి చేస్తారని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
News January 21, 2026
నిర్మల్: ‘పోటీ చేసే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి’

నిర్మల్ లోని 42 కౌన్సిలర్ స్థానాలకు, ఖానాపూర్‌లోని 12 కౌన్సిలర్ స్థానాలకు, ముధోల్‌లోని 26 కౌన్సిలర్ స్థానాలకు సంబంధించి బీజేపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ ఎన్నికల కన్వీనర్ రావుల రామ్నాథ్ సూచించారు. నిర్మల్ వారు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం (గాజుల పేట్), (ముధోల్) భైంసా ఎమ్మెల్యే నివాసం వద్ద, ఖానాపూర్ వాళ్ళు స్థానిక బీజేపీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.


