News February 23, 2025

తిరునాళ్లకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

image

కోటప్పకొండలో జరుగుతున్న ఉత్సవాలలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో తిరునాళ్ల పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభలు తరలింపుకు ఎటువంటి అంతరాయం కలగకుండా రోడ్లను తీర్చిదిద్దాలన్నారు. ప్రభల రాకపోకలకు విద్యుత్ వైర్లు తగలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మంచినీటి సరఫరా పగడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.

Similar News

News November 15, 2025

చిత్తూరు: రేడియో కాలర్ టెక్నాలజీకి కేంద్ర గ్రీన్ సిగ్నల్.!

image

ఉమ్మడి జిల్లాలో ఆరు ఏనుగుల గుంపులకు <<18292966>>రేడియో కాలర్<<>> టెక్నాలజీని అమర్చేలా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒంటరి ఏనుగులు, చిరుతలు, ఇతర జంతువులు అడవి నుంచి బయటకు రాకుండా AI టెక్నాలజీని వినియోగించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా AI బేస్డ్ ఇన్‌ఫ్రా‌రెడ్ కెమెరాల ఏర్పాటుకు టెండర్లను ఆహ్వానించినట్లు సమాచారం. 120 కెమెరాలను అమర్చి మానవ-జంతువుల మధ్య ఘర్షణ నివారణ చర్యలు చేపట్టనుంది.

News November 15, 2025

గిల్ హెల్త్‌పై BCCI అప్‌డేట్

image

ఈడెన్ గార్డెన్స్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన గిల్ కేవలం 3 బంతులే ఆడి మెడనొప్పి కారణంగా వెనుదిరిగిన విషయం తెలిసిందే. అతని ఆరోగ్య పరిస్థితిపై BCCI అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘శుభ్‌మన్ గిల్‌కు మెడ కండరాలు పట్టేశాయి. వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. వైద్య నివేదిక వచ్చిన తర్వాత అతను ఈరోజు ఆడతారా.. లేదా? అనే దానిపై నిర్ణయం తీసుకుంటాం’ అని పేర్కొంది.

News November 15, 2025

160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తే లక్ష్యం: CM

image

CII సమ్మిట్‌లో సెంటర్ ఫర్ ఎనర్జీ, సైబర్ రెజిలియన్స్ కేంద్రం ఏర్పాటుకు CM చంద్రబాబు సమక్షంలో AP ప్రభుత్వంతో వరల్డ్ ఎకనామిక్ ఫోరం MOU కుదుర్చుకుంది. 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని APలో ఉత్పత్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు CM పేర్కొన్నారు. AI లాంటి టెక్నాలజీ వినియోగం ద్వారా విద్యుత్ పంపిణీ నష్టాలు, సరఫరా వ్యయం తగ్గించాలని ఆయన సూచించారు. నాణ్యమైన, తక్కువ వ్యయంతో విద్యుత్ సరఫరా చేయాల్సి ఉందన్నారు.