News August 11, 2025

తిరుపతి:నేటి నుండి FA-1 పరీక్షలు

image

నేటి నుంచి FA-1 పరీక్షలు జరగనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం తెలుగు, మధ్యాహ్నం గణితం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈనెల 14వ తేదీ పరీక్షలు పూర్తి కానున్నట్లు పేర్కొన్నారు. ప్రతి సబ్జెక్టుకు మూల్యాంకన పుస్తకం ఇచ్చినట్లు తెలిపారు. అందులోనే పరీక్షలు రాయాలని సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1,72,228 మంది విద్యార్థులు ఒకటి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్నారు.

Similar News

News March 7, 2026

HYD: మేడం సార్.. మేడం అంతే!

image

షాద్‌నగర్‌కి చెందిన ఇంద్రార్చిత కర్ణాటక క్యాడర్‌లో సివిల్స్‌లో 627వ ర్యాంకు సాధించి సత్తాచాటారు. ఆమె ప్రాథమికోన్నత విద్య షాద్‌నగర్‌లో పూర్తిచేశారు. HYDలోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఆఫ్ ఉమెన్‌లో ఇంటర్, డిగ్రీ వరకు చదివారు. అనంతరం ఇగ్నో యూనివర్సిటీలో MA పొలిటికల్ సైన్స్ పూర్తి చేసి.. ఢిల్లీకి వెళ్లి కోచింగ్ తీసుకొని సివిల్స్‌కు సిద్ధమయ్యారు. నిన్న విడుదలైన ఫలితాల్లో ‘మేడం’ గ్రేట్ అనిపించుకున్నారు.

News March 7, 2026

రాజకీయాల్లోకి త్రిష?

image

TVK చీఫ్ విజయ్‌‌-త్రిష డేటింగ్ రూమర్స్ మధ్య మరో ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. అదే త్రిష పొలిటికల్ ఎంట్రీ. తనకు CM అవ్వాలని ఉందంటూ గతంలో ఆమె చేసిన కామెంట్స్‌ తెరపైకి వచ్చాయి. త్వరలోనే విజయ్ TVK పార్టీలో చేరనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుకోసం సినిమాలకు సైన్ కూడా చేయడంలేదని మరో గాసిప్. ఇక భార్యతో విడాకుల సెటిల్మెంట్ తర్వాత త్రిషను విజయ్ వివాహం చేసుకోనున్నారని వార్తలొస్తున్నాయి.

News March 7, 2026

ఖమ్మం: మహిళలకు ఉచిత వృత్తి శిక్షణ

image

ఖమ్మంలోని టేకులపల్లి మహిళా ప్రాంగణంలో నిరుపేద మహిళలకు ‘రిటైల్ అండ్ సేల్స్ అసిస్టెంట్’ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు మేనేజర్ విజేత తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన 18-35 ఏళ్ల లోపు వయస్సు, పదో తరగతి అర్హత ఉన్న మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. 3 నెలల శిక్షణతో పాటు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తారు. ఆసక్తి ఉన్నవారు వెంటనే ధ్రువీకరణ పత్రాలతో కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.