News May 7, 2025
తిరుపతిలో ఉచిత శిక్షణ.. ఉద్యోగం

నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (NAC) తిరుపతిలో షెడ్యూల్ కులాలకు (SC) చెందిన నిరుద్యోగ యువతి, యువకులకు ఉచిత శిక్షణ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు సెంటర్ ఏడీ సతీశ్ చంద్ర పేర్కొన్నారు. డిజిటల్ మార్కెటింగ్, ఫ్రంట్ ఆఫీస్, టెక్నీషియన్, హెయిర్ స్టైలింగ్, ఐటీ హెల్ప్ డెస్క్ కోర్సులలో ఉచిత నైపుణ్య శిక్షణ కల్పిస్తున్నట్లు చెప్పారు. పదో తరగతి, ఇంటర్, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని తెలిపారు.
Similar News
News February 13, 2026
‘అనంత బాలోత్సవం’ బ్రోచర్ ఆవిష్కరణ

అనంతపురంలోని SSBN కళాశాలలో ఈనెల 21, 22వ తేదీల్లో జరగనున్న ‘6వ అనంత బాలోత్సవం’ పోస్టర్‌ను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆనంద్ బాబు ఆవిష్కరించారు. చిన్నారుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ పిల్లల పండుగను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పరమేశ్, అధ్యాపకులు, అధికారులు పాల్గొన్నారు.
News February 13, 2026
రామగుండం కార్పొరేషన్ ‘హస్త’గతం

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 60 డివిజన్లలో 38 స్థానాలను కైవసం చేసుకొని మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ 13 స్థానాల్లో విజయం సాధించగా, ఏఐఎఫ్‌బీ 6 స్థానాలకు పరిమితమైంది. బీజేపీ, సీపీఐ, ఇండిపెండెంట్ ఒక్కో స్థానంలో గెలుపొందారు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల గెలుపు సంబరాలు మిన్నంటాయి.
News February 13, 2026
ఖమ్మం జిల్లాలో ఏ పార్టీ.. ఎన్ని వార్డులు గెలిచిందంటే?

ఖమ్మం జిల్లాలోని 5 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. గెలిచిన పార్టీల వివరాలిలా..
☆ 1) ఏదులాపురం(32 వార్డులు).. కాంగ్రెస్-24, BRS-2, CPM-2, CPI-3, ఇండిపెండెంట్(IND)-1
☆ 2) వైరా(20).. కాంగ్రెస్-12, BRS-5, CPM-1, CPI-1, IND-1
☆ 3) సత్తుపల్లి(23).. కాంగ్రెస్-17, BRS-6
☆ 4) కల్లూరు(20).. కాంగ్రెస్-12, BRS-7, IND-1
☆ 5) మధిర(22).. కాంగ్రెస్-18, BRS-1, IND-3.


