News November 8, 2025

తిరుపతిలో ఒకే వేదికపై తండ్రి కొడుకులు

image

తిరుపతిలో పవన్ కళ్యాణ్ పర్యటనలో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం వ్యక్తిగత కార్యదర్శి, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ జి.ఆర్. మధుసూదన్ తన విధుల్లో భాగంగా పాల్గొన్నారు. అదే కార్యక్రమంలో ఆయన తండ్రి తిరుపతి అర్బన్ డిప్యూటీ తహశీల్దార్ జి. రామచంద్ర కూడా పాల్గొన్నారు. వీరిని డిప్యూటీ సీఎం అభినందించారు.

Similar News

News January 23, 2026

NRPT: హోటళ్లలో తనిఖీలు చేపట్టాలి: కలెక్టర్

image

జిల్లా వ్యాప్తంగా హోటళ్లలో తనిఖీలు చేపట్టాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. నారాయణపేట కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి ఫుడ్ సేఫ్టీ సలహా కమిటీ సమావేశంలో మాట్లాడారు. ఆహార సంస్థలు, హోటళ్లలో పరిశుభ్రత పాటించాలని సూచించారు. అనుమతులు లేనిది హోటళ్లు ఏర్పాటు చేయరాదని, అనుమతుల కోసం మేళా నిర్వహించాలని అధికారులకు సూచించారు. అదనపు కలెక్టర్ శ్రీను, అధికారులు పాల్గొన్నారు.

News January 23, 2026

NGKL: గురుకులాల్లో ప్రవేశాలకు పోస్టర్ ఆవిష్కరణ

image

జిల్లాలోని మైనారిటీ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో 2026–27 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు డీఎమ్ డబ్ల్యూఓ రాజేశ్వరి ఆధ్వర్యంలో కలెక్టర్ బదావత్ సంతోష్ గురువారం పోస్టర్‌ను ఆవిష్కరించారు. 5వ తరగతి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్‌తో పాటు 6, 7, 8 తరగతుల్లోని బ్యాక్‌లాగ్ ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 28 వరకు tgmreistelangan.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

News January 23, 2026

NGKL: జిల్లాలో 795 టన్నుల యూరియా నిల్వలు

image

నాగర్ కర్నూల్ జిల్లాలో 795 టన్నుల యూరియా నిల్వలు ఉన్నట్లు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ గురువారం సాయంత్రం పేర్కొన్నారు. మరో 3,369 టన్నుల యూరియా జిల్లాకు కేటాయించినట్లు చెప్పారు. జిల్లాలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ ఏడాది మొక్కజొన్న పంట అధికంగా సాగు చేయడం వల్ల యూరియాకు డిమాండ్ ఏర్పడిందని తెలిపారు. ఈ సీజన్లో ఇప్పటివరకు రైతులకు 21.802 టన్నుల యూరియా పంపిణీ చేశామన్నారు.