News August 13, 2025

తిరుపతిలో ట్రైన్ కింద పడి వ్యక్తి మృతి

image

తిరుపతి రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్ నం.3 వద్ద బుధవారం యాక్సిడెంటల్ రిలీఫ్ ట్రైన్ కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లభించలేదు. కుడి ఛాతిపై ‘ఆ, ఈ’ హిందీ అక్షరాలు, ఆంజనేయస్వామి పచ్చబొట్టు ఉన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని SV మెడికల్ కాలేజీ మార్చురీకి తరలించారు. సమాచారం కోసం ఇన్‌స్పెక్టర్ ఆశీర్వాదం నంబరు 94406 27638ను సంప్రదించవచ్చన్నారు.

Similar News

News March 13, 2026

సాగు, తాగునీటిపై కలెక్టర్ ‘సమీక్ష’

image

ఎండలు ముదురుతున్న నేపథ్యంలో జిల్లాలో సాగు, తాగునీటి ఎద్దడి తలెత్తకుండా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మిర్యాలగూడ నుంచి పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి, తాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.

News March 13, 2026

RR: ‘పది’ పరీక్షలకు సర్వం సిద్ధం.. 53,058 విద్యార్థులు

image

పదో తరగతి వార్షిక పరీక్షలు ఈనెల 14వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. పరీక్షలు శనివారం ప్రారంభమై.. ఏప్రిల్ 16వ తేదీ వరకు జరుగుతాయి. పరీక్షల నిర్వహణ కోసం జిల్లా వ్యాప్తంగా 255 సెంటర్లు 1,024 పాఠశాలల నుంచి 53,058 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. మాస్ కాపీకి పాల్పడకుండా సెట్టింగ్ స్క్వాయిడ్, ప్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశారు.

News March 13, 2026

కడప: ఇవాళ్టి ఇంటర్ పరీక్షకు 276 మంది డుమ్మా

image

కడప జిల్లాలో శుక్రవారం 62 సెంటర్లలో 2nd ఇంటర్ ఫిజిక్స్ పేపర్-2 పరీక్షలు జరిగాయి. నేడు 12,141 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 11,865 మంది హాజరయ్యారు. 276 మంది ఆబ్సెంట్ అయ్యారు. ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించినట్లు ఇంటర్మీడియట్ అధికారులు వెల్లడించారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.