News February 10, 2025

తిరుపతిలో విద్యార్థిపై దాడి

image

తిరుపతిలోని ఎస్వీయూలో విద్యార్థిపై కత్తితో దాడి చేసిన ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. హెచ్ బ్లాక్‌లో విద్యార్థులపై మణికంఠ కత్తితో దాడి‌ చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంకటేశ్వర్లు అనే పీజీ మొదటి సంవత్సరం విద్యార్థికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. పోలీసుల అదుపులో మణికంఠ ఉన్నట్లు తెలుస్తోంది.

Similar News

News February 11, 2026

సంగారెడ్డి: 9 గంటలకు 13.19% పోలింగ్

image

సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీలో ఉదయం 9 గంటలకు 13.19 శాతం పోలింగ్ నమోదైంది. ఆందోలు జోగిపేట- 14.13, గడ్డపోతారం-15.47, గుమ్మడిదల- 12.40, ఇంద్రేశం- 13.30, జిన్నారం 12.57,కొహీర్- 16.52, ఇస్నాపూర్- 17.13, నారాయణఖేడ్- 11.10, సదాశివపేట- 15.68, సంగారెడ్డి 6.94, జహీరాబాద్ 16.64% శాతం పోలింగ్ నమోదయింది.

News February 11, 2026

తిరుమల: లీవ్ పెట్టారా.. పెట్టించారా?

image

తిరుమల కల్తీ నెయ్యి కేసులో టీటీడీ ఎఫ్ఏ అండ్ సీఏవో ఓ.బాలాజీ ప్రమేయం ఉందని సిట్ తేల్చింది. చర్యలకు సిఫార్సు చేసింది. అయితే ఆయన సెలవుపై వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. గడిచిన కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో సెలవు పెట్టారని కొందరి వాదన. చర్యలు తీసుకునే ముందు ఆయనను సెలవు పెట్టించారనే ప్రచారం సైతం జరుగుతోంది. మరి ఆయనపై ఎలాంటి చర్యలు ఉంటాయనేది చూడాలి మరి.

News February 11, 2026

నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 110 పాయింట్లు కోల్పోయి 84,163 వద్ద.. నిఫ్టీ 13 పాయింట్లు నష్టపోయి 25,921 దగ్గర ట్రేడవుతోంది. సెన్సెక్స్-30 సూచీలో M&M, టైటాన్, మారుతీ, SBI షేర్లు లాభాల్లో.. HCL టెక్, ట్రెంట్, TCS, ఎయిర్‌టెల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మూడు రోజుల వరుస లాభాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు గరిష్ఠాల వద్ద అమ్మకాలకు దిగుతున్నారు.