News September 10, 2025

తిరుపతిలో ISPS డేటా సైన్స్ సెంటర్ ప్రారంభం

image

నలందానగర్‌లో ఏర్పాటు చేసిన ISPS డేటా సైన్స్ సెంటర్, సిర్. రావు సెమినార్ హాల్‌ని బుధవారం జిల్లా కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ ప్రారంభించారు. స్టాటిస్టిక్స్ కన్సల్టెన్సీ సెల్, ప్రొఫెసర్ పి.సి. మహలనోబిస్ కంప్యూటర్ లాబొరేటరీ, సెల్ఫ్-స్టడీ లైబ్రరీ, రూఫ్ గార్డెన్‌ని సందర్శించారు. స్టడీ లైబ్రరీలో విద్యార్థుల వసతుల గురించి ప్రెసిడెంట్ రాజశేఖరరెడ్డి కలెక్టర్‌కి వివరించారు.

Similar News

News December 17, 2025

నారాయణపేట: తుది దశలో మొదటి విజయం

image

ఊట్కూరు మండల పరిధిలోని సమిస్తాపూర్ గ్రామంలో పంచాయతీ ఎన్నికల తొలి ఫలితం వెలువడింది. గ్రామంలో మొత్తం 440 ఓట్లు ఉండగా 382 ఓట్లు పోలయ్యాయి. నలుగురు అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీలో రింగు గుర్తుకు 48, కత్తెర గుర్తుకు 176, బ్యాట్ గుర్తుకు 30, ఫుట్‌బాల్ గుర్తుకు 127 ఓట్లు వచ్చాయి. ఇందులో కత్తెర గుర్తుతో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి జయప్రకాశ్ రెడ్డి సర్పంచ్‌గా గెలుపొందారు.

News December 17, 2025

గొల్లభామ తండా సర్పంచ్‌గా బాలు నాయక్

image

చెన్నారావుపేట మండలంలోని గొల్లభామ తండా గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన గుగులోతు బాలు నాయక్ విజయం సాధించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధే లక్ష్యంగా ప్రజలతో కలిసి ముందుకు సాగుతానని, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

News December 17, 2025

ఉగాది నాటికి మరో 5 లక్షల గృహప్రవేశాలు: CM

image

AP: గడువులోగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని CM CBN కలెక్టర్లను ఆదేశించారు. ‘ఇటీవల 3 లక్షల ఇళ్లకు సామూహిక గృహప్రవేశాలు నిర్వహించాం. ఉగాది నాటికి మరో 5 లక్షల గృహప్రవేశాలు నిర్వహించబోతున్నాం. ప్రతి 3 నెలలకు టార్గెట్ పెట్టుకుని నిర్మాణం పూర్తి చేయాలి. గతంలో ఊళ్లకు దూరంగా ఇళ్ల స్థలాలు కేటాయించడంతో కొందరు వెళ్లడం లేదు. వారికి ఇతర ప్రాంతాల్లో స్థలాలు కేటాయించాలి’ అని సూచించారు.